మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులను సీబీఐ నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరు పర్చింది.ఈ క్రమంలో విచారణ నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డితో పాటు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కోర్టుకు హాజరు అయ్యారు.
ఇదే కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డిలను ఈనెల 8వ తేదీన న్యాయస్థానం ఎదుట సీబీఐ అధికారులు హాజరు పరచనున్నారని తెలుస్తోంది.అనారోగ్యం కారణంగా ఇవాళ హాజరు కాలేదని సమాచారం.
మరోవైపు అప్రూవర్ దస్తగిరి విచారణకు గైర్హాజరు అయ్యారు.అటు వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ మంజూరు చేయాలని దాఖలైన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం సీబీఐకి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో హత్య కేసు విచారణను కోర్టు ఈనెల16కు వాయిదా వేసింది.







