తెలంగాణలో ఎత్తులు, పై ఎత్తుల రాజకీయం నడుస్తోంది.రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారుతోంది.
తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం కోసం బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళుతుంది.ఢిల్లీ అగ్రనాయకత్వం కనుసన్నల్లోనే రాష్ట్రంలోని పార్టీ కార్యక్రమాలు సాగుతున్నాయి.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారం దక్కించుకోవడం కోసం జాతీయ నాయకత్వం రూట్ మ్యాప్ రెడీ చేసింది.
అధికారమే లక్ష్యంగా అధినాయకత్వం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిపెట్టి్ంది.పకడ్బందీ ప్రణాళికలతో నాయకులకు సూచనలు చేస్తున్నారు.
దీనికి తోడు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై వివిధ సంస్థలు, బృందాలు సర్వే చేసి అమిత్ షా, నడ్డాలకు రిపోర్ట్ పంపుతున్నాయి.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఈ బృందాలు సమాచార సేకరణ చేస్తున్నాయి.
తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల పనితీరు తదితరా సమాచారాన్ని ఈ బృందాలు ఎప్పటికప్పుడు ఢిల్లీకి చేరవేస్తున్నాయి.రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జీ తరుణ్‌ఛుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పది ఉమ్మడి జిల్లాల సమీక్ష సమావేశాలు నిర్వహించారు.
బలమైన అభ్యర్థులు లేని అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు.

ఇక బలహినంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీని మరింత పటిష్టం చేయడం, కమిటీ కన్వీనర్లు, పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు, సభ్యుల నియామకంపై రాష్ట్ర పార్టీని ఢీల్లి నేతలు ఆదేశించారు.తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో నిర్వహించారు.ఇప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టార్గెట్ చేసింది.
కేంద్ర మంత్రి అమిత్ షా ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు.ఈ రెండు రోజుల్లో జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జీలతో సమావేశం కానున్నారు.
దూకుడు మీదున్న బీజేపీని తెలంగాణ ప్రజలు ఎలా అదిరిస్తారో చూడాలి
.






