స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.
ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేందుకు బన్నీ రెడీ అయ్యాడు.ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో అధికారికంగా ప్రారంభించాడు బన్నీ.
గతంలోనూ ఆర్య, ఆర్య 2 వంటి హిట్స్ అందించిన ఈ కాంబో, మరోసారి జతకట్టింది.హ్యాట్రిక్ హిట్స్‌పై కన్నేసిన బన్నీ-సుక్కు కాంబో, ఈ సారి మరో అదిరిపోయే సబ్జెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు.
ఇప్పటికే రంగస్థలం చిత్రంతో ఇండస్ట్రీ హిట్ నమోదు చేసిన సుకుమార్, తన సత్తా ఏమిటో మరోసారి ఇండస్ట్రీకి చూపించనున్నారు.
ఆర్య, ఆర్య 2 సినిమాలు బన్నీ కెరీర్‌లో సూపర్ హిట్‌లుగా నిలిచిన సంగతి తెలిసిందే.
దీంతో వీరి కాంబోలో రాబోయే సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం ఖాయమని అంటున్నారు సినీ వర్గాలు.ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
కాగా అల వైకుంఠపురములో సినిమాతో మరోసారి త్రివిక్రమ్‌తో కలిసి హిట్ కొట్టేందుకు రెడీ అయ్యాడు స్టైలిష్ స్టార్.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.