టీడీపీ అధినేత చంద్రబాబు దళితులకు క్షమాపణలు చెప్పాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ డిమాండ్ చేశారు.చంద్రబాబు అహంకారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో దాడికి పాల్పడింది టీడీపీ నేతలేనని మంత్రి ఆదిమూలపు ఆరోపించారు.రాజ్యాంగాన్ని నిర్మించిన బీఆర్ అంబేద్కర్ ను చంద్రబాబు మరచిపోయారన్నారు.
దళితులకు అవకాశాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ ది అని తెలిపారు.దళితులంతా ఏకమై చంద్రబాబుకు ఏంటో చూపిస్తామని వెల్లడించారు.