తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.అయితే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఎక్కువ ఉండటం కారణంగా పెద్ద ఎత్తున సీనియర్ ల అసంతృప్తి వైఖరితో కొంత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చర్చగా మారినా మరల రకరకాల వ్యూహంతో ముందుకొస్తూ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలనే లక్ష్యం దిశగా ముందడుగు వేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే మొన్నటి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనకు పార్టీలో అవమానం జరుగుతున్నదంటూ ఏకంగా రాజీనామాకు సిద్దపడటం లాంటి పరిణామాలు ఎంతగా తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కించాయనేది మనకు తెలిసిందే.
అయితే అధిష్టానం జోక్యం చేసుకోవాలంటూ జగ్గారెడ్డి పట్టుబట్టిన విషయం తెలిసిందే.
అయితే అధిష్టానానికి ఇచ్చిన 15 రోజుల గడువు ముగిసినా ఇంకా జగ్గారెడ్డి తన రాజీనామాస్త్రంపై స్పందించకపోవడంతో రాజకీయ వర్గాలలో సరికొత్త చర్చ జరుగుతోంది.అయితే జగ్గారెడ్డికి అధిష్టానం నుండి హామీ లభించిందని వచ్చే రోజుల్లో కాంగ్రెస్ అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడుతాయని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఇంత వరకు జగ్గారెడ్డి ఈ విషయాన్ని ధృవీకరించనప్పటికీ ఇక రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టేనని అర్ధం చేసుకోవాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే జగ్గారెడ్డి ఇక రేవంత్ కు పూర్తి మద్దతు ఇవ్వకపోయినా తటస్థంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎందుకంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా సంగారెడ్డిలో మరియు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పట్టును నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అయితే ఇక రాష్ట్ర వ్యాప్త విషయాలపై కాక నియోజకవర్గానికి మాత్రమే పూర్తిగా దృష్టి కేంద్రీకరించే అవకాశం కనిపిస్తోంది.ఒకవేళ రేవంత్ ముందుకొచ్చి జగ్గారెడ్డిని కలుపుకొని ముందుకువెళ్తే రేవంత్ కు జగ్గారెడ్డి సహకరిస్తారా లేదా అనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.