టాయిలెట్ అనేవి మలమూత్రాలను వదిలించుకోవడానికి ఉపయోగపడే ఒక ఫెసిలిటీ.ప్రకృతి పిలవగానే పని ముగించామా లేదా అన్నదే తప్ప టాయిలెట్ గురించి పెద్దగా పట్టించుకోరు.
అయితే ఇలా అనుకోవడం నిజంగా పొరపాటే అవుతుంది.ఎందుకంటే కొన్ని దేశాల్లో టాయిలెట్స్‌కి ప్రత్యేకత ఉంది.
వీటికి చట్టాలు కూడా ఉన్నాయి.ఇంకా ఎన్నో విశేషాలు టాయిలెట్స్‌కి ఉండటం గమనార్హం.
వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఒక వ్యక్తి తన జీవితకాలంలో మూడేళ్లపాటు టాయిలెట్‌లోనే గడుపుతాడు.ఒక ఏడాదిలో సుమారు 2500 సార్లు టాయిలెట్‌కి వెళ్తాడు.ఇక క్యూబా దేశంలో టాయిలెట్ పేపర్ దానికి తగినట్లు దొరకదు అందువల్ల దీన్ని స్మగ్లింగ్ కూడా చేస్తుంటారట అక్కడ.ఇక ఫ్రాన్స్ దేశంలో పబ్లిక్ గా యూరిన్ పోస్తే వారికి 6.188 రూపాయల ఫైన్ విధిస్తారు.స్వీడన్‌లో పబ్లిక్ టాయిలెట్లకు డబ్బులు కట్టాల్సి ఉంటుంది.

దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో టాయిలెట్లు గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తాయట.ఇక సౌత్ కొరియాలో ఏకంగా ఒక టాయిలెట్ థీమ్ పార్క్‌ను నిర్మించారట.ఎందుకంటే వారికి టాయిలెట్స్ అంటే చాలా ఇష్టమంట.
జపాన్‌లోని టాయిలెట్స్‌లో రకరకాల మ్యూజిక్ ప్లే చేయడానికి అందుబాటులో ఉండటం విశేషం.ఇకపోతే మరుగుదొడ్ల చరిత్ర ప్రాచీన నాగరికతల నాటిది.

ఇప్పటి పాకిస్థాన్, పశ్చిమ భారతదేశంలోని సింధు లోయ నాగరికతలో పురాతన మరుగుదొడ్లు కనుగొనబడ్డాయి, ఇవి సుమారు కీ.పూ 2500 నాటివి.ఈ మరుగుదొడ్లు నేలలోని సాధారణ రంధ్రాలు, డ్రైనేజీ వ్యవస్థకు కనెక్ట్ అయి ఉంటాయి.పురాతన ఈజిప్షియన్లు కూడా అదే సమయంలో మరుగుదొడ్డి రూపాన్ని అభివృద్ధి చేశారు, ఇది నిస్సార గొయ్యిపై సీటును కలిగి ఉంటుంది.







