ఫుల్ బిజీ గా అక్కినేని హీరోలు.. తగ్గేదేలే అంటున్నారు?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్ద ఫ్యామిలీలలో అటు అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటీ అన్న విషయం తెలిసిందే.అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున నాగచైతన్య అఖిల్ లు హీరోలుగా కొనసాగుతున్నారు.

 Akkineni Heros Back To Back Projects, Nagachaitanya, Akhil , Most Eligible Bachelor, Samantha, Love Story, Bangaraju, Praveen Sattaru, Surender Reddy, Tollywood-TeluguStop.com

అయితే ప్రస్తుతం చూసుకుంటే నాగచైతన్య అఖిల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అయితే తాను ఎక్కడ తక్కువ కాదు అంటూ తండ్రి నాగార్జున కూడా వరుసగా సినిమా షూటింగులు చేస్తున్నాడు అని తెలుస్తోంది.సమంతతో విడాకుల తరువాత తన ఫోకస్ మొత్తం కెరియర్ మీద పెట్టాడు నాగ చైతన్య.

ఈ క్రమంలోనే వచ్చిన లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్ యూ సినిమాలో నటిస్తున్నాడు నాగచైతన్య.

 Akkineni Heros Back To Back Projects, Nagachaitanya, Akhil , Most Eligible Bachelor, Samantha, Love Story, Bangaraju, Praveen Sattaru, Surender Reddy, Tollywood-ఫుల్ బిజీ గా అక్కినేని హీరోలు.. తగ్గేదేలే అంటున్నారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకున్న పరశురామ్ తో ఒక సినిమాకు సైన్ చేశాడు.ఇక తమ్ముడు అఖిల్ కూడా తగ్గేదేలే అంటున్నాడు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లోనే మొదటి విజయాన్ని అందుకున్న అఖిల్ ఇక జాగ్రత్తగా నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్నారు.సినిమా కోసం కండలు ఫ్రెండ్షిప్ భారీగానే కష్టపడ్డాడు.ఏజెంట్ తో భారీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.ఈ సినిమా మనాలి లో షూటింగ్ జరుపుకుంటుంది.ఇక తండ్రి నాగార్జున సైతం ఒక వైపు సినిమాలు మరో వైపు టీవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఇటీవల బిగ్బాస్ ఓటిటి పూర్తి చేసుకోగా.త్వరలోనే బిగ్బాస్ సీజన్ సిక్స్ మొదలు కాబోతుంది.

ఇక మరోవైపు ప్రవీణ్ సత్తారు తో యాక్షన్ ఎంటర్ టైనర్ ఘోస్ట్ లో నటిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube