కొత్త ఇల్లు కొన్న హీరో ధనుష్... ఇంటి ఖరీదు తెలిస్తే మతి పోవాల్సిందే!

కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో ధనుష్ ప్రస్తుతం తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ధనుష్ తాజాగా తన డ్రీమ్ హౌస్ లోకి అడుగుపెట్టారు.

 Hero Dhanush Luxury Home At Poes Garden Chennai House Warming Pics Viral Details-TeluguStop.com

చెన్నైలో అత్యంత ధనవంతులు ఉండే పోయిస్ గార్డెన్ లో దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసే రెండు సంవత్సరాల క్రితం ఇంటి స్థలం కొనుగోలు చేశారు.ఇలా రెండు సంవత్సరాల క్రితం ఐశ్వర్య ధనుష్ భూమి పూజ నిర్వహించి ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించారు.

Telugu Aishwarya, Chennai, Dhanush, Dhanush Luxury, Kollywood, Poes Garden, Sir-

ఈ విధంగా ధనుష్ అన్ని సదుపాయాలతో ఈ ఇంటిని నిర్మించారని తెలుస్తోంది.అయితే ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో ఈయన తన కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహప్రవేశం చేశారు.దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఐశ్వర్యతో విడాకులు తీసుకుని విడిపోయిన ధనుష్ ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి గృహప్రవేశం చేశారు.

ఇలా తన భార్య పిల్లలతో కలిసి ఈ ఇంటిలో ఉండడం కోసమే ఈయన ఈ ఇంటి నిర్మాణం చేపట్టారు అయితే తన భార్యతో విడిపోయినప్పటికీ ఇంటి నిర్మాణం మాత్రం ఆపలేదని తెలుస్తుంది.

Telugu Aishwarya, Chennai, Dhanush, Dhanush Luxury, Kollywood, Poes Garden, Sir-

ఇలా అన్ని హంగులతో నిర్మించిన ఈ ఇంటి కోసం ధనుష్ దాదాపు 150 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం.ఇలా భారీ హంగులతో అత్యంత ఖరీదైన ఇంటిని నిర్మించి ఆ ఇంటిలో నివసించాలనేదే ధనుష్ కోరిక అని అయితే ప్రస్తుతం తాను విడాకులు తీసుకోవడంతో ఆ ఇంటిని తన తల్లిదండ్రులకు కానుకగా ఇచ్చారని ధనుష్ సన్నిహితుల సమాచారం.ఇలా ధనుష్ నూతన ఇంటికి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈయన సినిమాల విషయానికొస్తే తాజాగా సార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.అయితే ఈయనకు ఇది మొదటి తెలుగు సినిమా కావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube