ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే పానీయాల్లో మజ్జిగ( buttermilk ) ఒకటి.మధ్యాహ్నం లంచ్ చేశాక మరియు నైట్ డిన్నర్ చేశాక ఒక గ్లాసు మజ్జిగ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది.
అయితే ఇకపై రాత్రిపూట బదులుగా ఉదయం మజ్జిగ తీసుకోవడం అలవాటు చేసుకోండి.రోజు ఉదయం ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల బోలెడు ఆరోగ్య లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మజ్జిగలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి12, ప్రోటీన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.అలాగే ప్రోబయోటిక్ గుణాలతో నిండి ఉండే మజ్జిగ ఆరోగ్యానికి అండగా నిలబడుతుంది.
రోజు ఉదయం ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.దాంతో పని వేళల్లో ఎంతో ఎనర్జిటిక్ గా, యాక్టివ్ గా ఉంటారు.
అలాగే మార్నింగ్ సమయంలో ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల జీర్ణాశయం( digestive tract ) మరియు పేగుల్లో ఉన్న హానికర బ్యాక్టీరియా నాశనం అవుతుంది.మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
ఫలితంగా అజీర్తి, గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు వేధించకుండా ఉంటాయి.
అధిక రక్తపోటు ( high blood pressure )సమస్యతో బాధపడుతున్న వారు రోజు ఉదయం ఉప్పు లేకుండా ఒక గ్లాసు మజ్జిగ తాగితే చాలా మంచిది.మజ్జిగ లో ఉండి పోషకాలు రక్తపోటును అదుపులోకి తెస్తాయి.మజ్జిగలో కొవ్వు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.
కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు కూడా మజ్జిగ తాగితే మంచిదే అని నిపుణులు చెబుతున్నారు.
అలాగే కొందరు పనిలో పడ్డారంటే వాటర్ తాగడం మర్చిపోతుంటారు.ఫలితంగా డీహైడ్రేషన్( Dehydration ) కు గురవుతారు.అయితే ఉదయం ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల ఆ సమస్యకు కాస్త దూరంగా ఉండవచ్చు.
పైగా మజ్జిగ శరీరంలో అధిక వేడిని తొలగిస్తుంది.రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.
దాహార్తిని సైతం తీరుస్తుంది.మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం.
కాబట్టి ఉదయం వేళ తొమ్మిది నుంచి పది గంటల మధ్య ఒక గ్లాసు మజ్జిగను తీసుకోవడం అలవాటు చేసుకోండి.