ప్రముఖ నటుడు, కమెడియన్ మాణిక్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.తనకు ఆర్థికపరమైన కష్టాలు ఎదురైన సమయంలో ఒక్క పైసా కూడా స్నేహితులను అడగనని తెలిపారు.
మనీ వల్ల కొన్ని నిమిషాల్లో స్నేహం చెడిపోతుందని మాణిక్ రెడ్డి అన్నారు.ఫ్రెండ్ షిప్ ను నిలబెట్టుకోవాలంటే కొన్ని విషయాల్లో రిజర్వ్ గా ఉండేవాడినని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అరవింద సమేత సినిమాలో చిన్న పాత్ర చేశానని ఆ పాత్రకు ఆ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఊహించలేదని మాణిక్ రెడ్డి తెలిపారు.ఎన్టీఆర్ ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉందని మాణిక్ రెడ్డి పేర్కొన్నారు.
ఆ సినిమా రిలీజైన తర్వాత అభిమానులలో చాలామంది తనతో సెల్ఫీలు దిగారని మాణిక్ రెడ్డి చెప్పుకొచ్చారు.బ్రేక్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఎలా ఉండాలో త్రివిక్రమ్ చెప్పారని మాణిక్ రెడ్డి తెలిపారు.
ఆ తర్వాత ఆఫీస్ లకు వెళ్లి కలిశానని తనను దృష్టిలో పెట్టుకుని దర్శకులు పాత్రలు రాసే స్టేజ్ సంపాదించుకున్నానని మాణిక్ రెడ్డి అన్నారు.అరవింద సమేతకు ముందు 30 సినిమాల్లో చేసినా పెద్దగా గుర్తింపు రాలేదని మాణిక్ అన్నారు.
దత్తాత్రేయ అంటే తనకు ఎంతో భక్తి అని మాణిక్ తెలిపారు.తన అసలు పేరు మాణిక్ ప్రభు అని నాన్నకు కూడా దైవభక్తి ఎక్కువని మాణిక్ రెడ్డి వెల్లడించారు.
ప్రతి మనిషి ఒకరికి అట్రాక్ట్ అవుతారని అయితే తనను ఛీ కొట్టి వెళ్లిపోయారని మాణిక్ రెడ్డి తాను ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పుకొచ్చారు.కాలేజ్ లో లవ్ ఫెయిల్యూర్ అని సినిమాల్లో ట్రై చేస్తున్నానంటే మొదట్లో ప్రేమించిన అమ్మాయి సపోర్ట్ చేసినా తర్వాత చేయలేదని మాణిక్ రెడ్డి వెల్లడించారు.ప్రేమించి బ్రేకప్ అయితే అది ఒక శాపమని నాలుగు సంవత్సరాలు ఆ బాధను తాను అనుభవించానని మాణిక్ రెడ్డి అన్నారు.