వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!

హెయిర్ ఫాల్( Hair fall ) కారణంగా ఇబ్బంది పడుతున్నవారు మనలో ఎంతో మంది ఉన్నారు.అలాగే ఇటీవల రోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే వైట్ హెయిర్ సమస్యను ఎదుర్కొంటున్నారు.

 If You Use This Oil Will Check Both Hair Fall And White Hair! Hair Fall, White H-TeluguStop.com

అయితే ఈ రెండు సమస్యలకు చెక్‌ పెట్టే మ్యాజికల్ ఆయిల్ ఒకటి ఉంది.వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను కనుక వాడారంటే జుట్టు రాలడం కంట్రోల్ అవ్వడమే కాదు వైట్ హెయిర్ సమస్య త్వరగా దరిచేరకుండా కూడా ఉంటుంది.

మరి ఇంతకీ ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా అంగుళం అల్లం ముక్కను( ginger ) తీసుకుని శుభ్రంగా క‌డిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఒక కప్పు కరివేపాకు( curry leaves ) మరియు వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ( Green tea )వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె పోసుకోవాలి.

అలాగే గ్రైండ్ చేసుకున్న అల్లం, కరివేపాకు, గ్రీన్ టీ మిశ్రమాన్ని వేసి చిన్న మంటపై దాదాపు పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.

Telugu Care, Care Tips, Oil, Healthy, Oilfall, Latest, Fall, White-Telugu Health

అనంతరం స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి.స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఈ ఆయిల్ ను అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.

ఆయిల్ అప్లై చేసుకున్న‌ మరుసటి రోజు తల స్నానం చేయాలి.వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.

Telugu Care, Care Tips, Oil, Healthy, Oilfall, Latest, Fall, White-Telugu Health

అలాగే కరివేపాకు అకాల తెల్ల జుట్టు సమస్యకు అడ్డుకట్ట వేస్తుంది.కురులు నల్లగా నిగనిగలాడుతూ మెరిసేలా ప్రోత్సహిస్తుంది.అలాగే అల్లం తలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

జుట్టు ఎదుగుదలను పెంచుతుంది.గ్రీన్ టీ సైతం హెయిర్ ఫాల్ ను తగ్గించి హెయిర్ గ్రోత్ రెట్టింపు చేస్తుంది.

జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరిగేందుకు అద్భుతంగా సహాయపడుతుంది.కాబట్టి హెయిర్ ఫాలో తో బాధపడుతున్న వారు, వైట్ హెయిర్ దరిచేరకుండా ఉండాలని భావించేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పకున్న మ్యాజికల్ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube