పచ్చి అల్లం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా..?
TeluguStop.com
అల్లం( Ginger ) గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు.దాదాపు అందరి ఇళ్లల్లో అల్లాన్ని విరివిగా ఉపయోగిస్తారు.
ముఖ్యంగా నాన్ వెజ్ వంటల్లో అల్లం కచ్చితంగా పడాల్సిందే.ఆహారం రుచిని పెంచడంలో అల్లం చాలా బాగా సహాయపడుతుంది.
అంతేనా ఆరోగ్యానికి కూడా బోలెడన్ని ప్రయోజనాలను అందిస్తుంది.అందులోనూ పచ్చి అల్లం తినడం మరింత ప్రయోజకరం.
అల్లాన్ని పచ్చిగా తినడం వల్ల ప్రత్యేకమైన లాభాలు పొందొచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
బరువు తగ్గడానికి పచ్చి అల్లం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వన్ టీ స్పూన్ అల్లం తరుము, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon Juice )కలిపి తీసుకుంటే శరీరంలో అదనపు కొవ్వు కరుగుతుంది.
వెయిట్ లాస్ అవుతారు.అదే సమయంలో అల్లం శరీరాన్ని డిటాక్స్ కూడా చేస్తుంది.
అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నివారణలో పచ్చి అల్లం గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.
పచ్చి అల్లాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఆయా సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందొచ్చు.
పచ్చి అల్లం ముక్కలు తినడం వల్ల అందులో ఉండే జింజెరోల్స్ జీర్ణప్రక్రియను సులభతరం చేస్తాయి.
ఆకలి పెంచుతాయి.గ్యాస్, కడుపు ఉబ్బరం ( Gas, Bloating )మరియు అజీర్తి సమస్యలకు చెక్ పెడతాయి.
"""/" /
గుండె ఆరోగ్యానికి అల్లం అండంగా నిలబడుతుంది.ఉదయాన్నే పచ్చి అల్లాన్ని తేనెతో కలిపి తీసుకుంటే గుండెకు రక్త ప్రసరణను మెరుగుపడుతుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెకు మేలైన మంచి కొలెస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి.ఫలితంగా గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
పచ్చి అల్లం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి.టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి ఇది చాలా సహాయపడుతుంది.
అంతేకాదండోయ్.పచ్చి అల్లం శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి వైరల్ ఇన్ఫెక్షన్లు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.
అయితే పచ్చి అల్లాన్ని అధిక పరిమాణంలో తీసుకోకూడదు.అలా చేస్తే జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.
పచ్చి అల్లాన్ని మితంగా తింటేనే ఆరోగ్యానికి ప్రయోజనకరం గుర్తుంచుకోండి.
ఖాళీ కడుపుతో వీటిని తింటే చాలా డేంజర్..!