చుండ్రు.నేటి కాలంలో ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.వయసుతో సంబంధం లేకుండా అందరూ చుండ్రు సమస్యను ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా మహిళలో ఈ సమస్య అధికంగా ఉంటుంది.అయితే ఈ సమస్య తగ్గించుకునేందుకు మార్కెట్‌లో దొరికే అన్ని ప్రోడెక్ట్స్‌ను ఉపయోగిస్తారు.కాని, ఫలితం లేక బాధపడతారు.
వాస్తవానికి పొల్యూషన్, హార్మోన్ల అసమతుల్యత, ఒత్తిడి, తలలో అధికంగా ఉండే నూనె, మృతచర్మ కణాలు, శుభ్రత పాటించకపోవడం, షాంపూ సరిగ్గా వాడకపోవడం వంటివి చండ్రు రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే.
సులువుగా, శాశ్వతంగా చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు.
అందులో ముందుగా.కలబంద గుజ్జు, నిమ్మరసం మరియు పెరుగు కలిపి తలకు పట్టించాలి.అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
ఇలా వారానికి రెండు సార్లు చేయడం చుండ్రు సమస్య శాశ్వతంగా తగ్గుముఖం పడుతుంది.అలాగే కొబ్బరి నూనెను వేడి చేసి.
అందులో నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి.
అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
ఇలా వారానికి రెండు నుంచి మూడు సార్లు చేయడం వల్ల చుండ్ర సమస్యకు చెక్ పెట్టవచ్చు.అదేవిధంగా, కొద్దిగా వేపాకు తీసుకుని బాగా పేస్ట్ చేయాలి.
ఈ పేస్ట్‌ను తలకు పట్టించి.అరగంట తర్వాత గోరువెచ్చిని నీటితో తలస్నానం చేయాలి.
ఇలా చేయడం వల్ల కూడా చుండ్రు సమస్యకు దూరంగా ఉండవచ్చు.