అక్కినేని హీరో అఖిల్ (Akkineni hero Akhil)ఎప్పటినుంచో సరైన హిట్ సినిమా కోసం చూస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటివరకు అఖిల్ ఐదు సినిమాలలో నటించగా అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(Most Eligible Bachelor) సినిమా తప్ప మిగతా దేవి కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను తెచ్చిపెట్టలేకపోయాయి.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కూడా కమర్షియల్ గా కలెక్షన్లను సాధించింది.ఇకపోతే అఖిల్(Akhil) తదుపరి సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.
ఇక నేడు అనగా ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాలు అధికారికంగా ప్రకటించనున్నారు.ఏజెంట్ మూవీ(Agent Movie) డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకున్న అఖిల్ ఎట్టకేలకు కొత్త సినిమా అప్డేట్ ఇస్తున్నాడు.
అఖిల్ తన ఆరవ సినిమాని వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ (Vinaro Bhagyam of Vishnukatha fame)మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్ లో చేస్తున్నాడు.నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ నేడు విడుదల కానుంది.
ఈ చిత్రానికి లెనిన్ అనే టైటిల్ లాక్ చేసినట్లు సమాచారం.ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీగా తెరకెక్కుతోందట.
ఇందులో శ్రీలీల (Sreeleela)హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.థమన్ సంగీతం అందిస్తున్నాడట.

అఖిల్, శ్రీలీల ఇద్దరు ఫ్లాప్స్ లో ఉన్నారు.అఖిల్ ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో హీరోగా నటించగా, అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించింది.ఇకపోతే ఇటు అఖిల్ కి, అలాగే శ్రీ లీలకి ఇద్దరికీ ఈ సినిమా హిట్ అవడం చాలా ముఖ్యం.ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఇద్దరికి మళ్ళీ గాడిలో పడ్డట్టే అని చెప్పాలి.
అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది ఏంటి అన్న వివరాలు మాత్రం ఇంకా తెలియడం లేదు.







