టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిదా సినిమా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. తన నాచురల్ అందంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంది.
పద్ధతిగా కనిపిస్తూ తన వ్యక్తిత్వంతో మంచి అభిమానం సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం తాను విరాటపర్వం సినిమాలో నటించగా ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇక ప్రమోషన్స్ భాగంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలు పంచుకుంది.ఇప్పటి వరకు ఎక్స్ పోజింగ్ చేయని హీరోయిన్ అంటే వెంటనే సాయి పల్లవి పేరు వినిపిస్తుంది.
ఇక తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పొట్టి బట్టలు వేసుకోవడం తో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని.ఇక అలాంటి అవుట్ ఫిట్ లో కంఫర్ట్ గా ఉండనని తెలిపింది.

తాను పొట్టి బట్టలు ధరించక పోవడానికి ఒక వీడియో కారణం అని ఒక విషయం బయట పెట్టింది.డాక్టర్ కోర్సులో భాగంగా జార్జియా కి వెళ్ళగా అక్కడ టాంగ్ డాన్స్ నేర్చుకుందట.ఓ ఈవెంట్ లో ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ వేసుకోవాలట.అని తన తల్లిదండ్రులకు అలా డాన్స్ చేయడం ఇష్టం లేదు అని.అయినా కూడా వాళ్ళని ఒప్పించి పర్ఫామెన్స్ చేశాను అని తెలిపింది.

ఆ సమయంలో తనకు ప్రేమమ్ సినిమాలో ఆఫర్ వచ్చింది అని.ఆ సినిమాతో మంచి గుర్తింపు రావడంతో.అప్పుడే డాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో బయటికి వచ్చింది అని.అసలు ఆ వీడియో ఎలా వచ్చిందో కూడా తనకు తెలియదు అని.దాని వల్ల తనకు విమర్శలు కూడా వచ్చాయి అని తెలిపింది.ఆ సమయంలో చాలా బాధపడ్డాను అని.ఇక అప్పటినుంచి పొట్టి బట్టలు వేసుకోవద్దని నిర్ణయించుకున్నాను అని తెలిపింది.ఇక ఆమె చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.







