కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి బేషరుతగా మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చిన జనసెన అదినేత పవన్ వైఖరి కొంత మంది జనసైనికులకు నచ్చలేదు.ఆ పార్టీ మరింత బలహీనం అయితే మనకు ఛాన్స్ దొరుకుతుంది కదా మనమేందుకు కలగ చేసుకోవడం అన్న అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా కొంతమంది జనసైనికులు వ్యక్త పరిచారు.
అయితే తనది నయా రాజకీయమని, తన ప్రతి నిర్ణయం వెనక ధీర్ఘకాల వ్యూహం ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరూపించుకున్నట్లుగా కొంత మంది రాజకీయ పరిశీలకులు అబిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే జనసేన – తెలుగుదేశం పొత్తుకు అతి పెద్ద అడ్డంకిగా ఇరు పార్టీల కార్యకర్తలను మానసికంగా సిద్ధం చేయడమే అన్నది నిన్నటి వరకు వినిపించింది.పొత్తు ఫైనల్ అయ్యేవరకు అనేక ఇబ్బందులను ఈ ఇరు పార్టీలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న అంచనాలు వినిపించాయి .ముఖ్యంగా జనసెన కి ఎక్కువ సీట్లు గాని అధికారంలో భాగంగానీ ఇవ్వడానికి తెలుగుదేశం కీలక నాయకులు ససేమిరా ఒప్పుకోరు అన్న అంచనాలు ఉండేవి.గౌరవప్రదమైన పొత్తు లేకపోతే జనసైనికులు కూడా నిరాశ చెందే వాతావరణం ఉండేది.అయితే సరైన సమయం సందర్భం చూసుకొని దూకుడుగా ముందుకెళ్లిన పవన్ పరిస్థితి ని తన చేతుల్లోకి తీసుకుని ఆ రెండు సమస్యలకు తనదైన పరిష్కారాన్ని చూపించారు.
కష్టకాలంలో అండగా నిలబడిన మిత్రుడికి స్నేహ ధర్మం పాటించాల్సిన పరిస్థితుల్లో తెలుగుదేశం కేడర్ను నెట్టేసిన పవన్ మరోవైపు జన సైనికులు ఆశించే రాజకీయ ప్రయోజనాన్ని కూడా పొందే విధంగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇప్పుడు పొత్తు చర్చలలో పవన్ దేపై చేయిగా ఉంటుందని, తాను కోరుకున్న సీట్లను జనసేన అభ్యర్థులు కీలకంగా ఉన్న నియోజక వర్గాల గురించిన చర్చల్లో పవన్ మాటే చెల్లుతుందని తెలుస్తుంది .అంతేకాకుండా ఎన్నికల తర్వాత జనసేన కీలకమైన స్థానాలను సాధిస్తే పవర్ షేరింగ్ ని కూడా డిమాండ్ చేసే పరిస్థితుల్లో జనసేన ఉంటుంది అన్నది వినిపిస్తున్న వార్తల సమాచారం.అలా సమయం చూసుకుని తన దూకుడుతో టిడిపి ని తన మీద ఆదార పడేలా చేసుకున్న పవన్ పొత్తు చర్చలను ఎన్నికల వ్యూహకర్తల మధ్య చర్చలా గా కాకుండా ఇద్దరు స్నేహితుల మధ్య వ్యవహారంలా మార్చేసారని పవన్ చేసిన సాయానికి తాను అడిగిన ప్రతిఫలాన్ని తిరిగి ఇవ్వాల్సిన మొహమాటం లో నందమూరి మరియు నారా కుటుంబాలను నెట్టేసినట్లుగా తెలుస్తుంది .దాంతో కచ్చితంగా పవన్ తన మాట చెల్లించుకుంటారని జనసేన ను పవర్ సెంటర్ గా నిలబెడతారన్న విశ్లేషణలు వస్తున్నాయి
.






