ఢిల్లీలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య పాలనా అధికారుల పంచాయతీ నడుస్తోంది.ఆర్డినెన్స్ చట్టంగా మారకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం ఆర్డినెన్స్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఆర్డినెన్స్ ను ఆప్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
ఈ మేరకు శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రేను కేజ్రీవాల్ కలవనున్నారు.కేంద్రం ఆర్డినెన్స్ ను అటు బీహార్ సీఎం కూడా వ్యతిరేకించారు.
అయితే పాలనా అధికారాలు ఆప్ ప్రభుత్వానికి కల్పిస్తూ గత వారం సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.కాగా ఈ తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.