శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రత్యర్థులు ఇద్దరు మహిళలపై దాష్టీకానికి ఒడిగట్టారు.
ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ తో కంకర మట్టి వేశారు.గమనించిన స్థానికులు మట్టిని తొలగించి మహిళలను కాపాడారు.
హరిపురం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు తమ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే గత కొన్నేళ్లుగా ఇంటి స్థలం విషయంలో మహిళలు పోరాటం చేస్తున్నట్లు తెలిపారు.
అధికారులు స్పందించి తమను, తమ స్థలాన్ని కాపాడాలని కోరుతున్నారు.అదేవిధంగా తమను వేధిస్తున్న ఆనందరావు, ప్రకాశ్ రావు, రామారావులపై చర్యలు తీసుకోవాలని వేడుతున్నారు.