ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా నటించిన కేజిఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు యశ్.ప్రస్తుతం ఈయనకి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యశ్ తాజాగా ముంబైలో జరిగిన ఇండియా టూడే కాన్క్లేవ్ ప్రోగ్రామ్లో పాల్గొన్న యష్.తన తదుపరి సినిమాలు,కేజీఎఫ్ 3 పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అదేవిధంగా నార్త్ సౌత్ ఇండస్ట్రీల గురించి కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకానొక సమయంలో ఇండియన్ సినిమా అంటేనే బాలీవుడ్ చిత్ర పరిశ్రమగా పేరు పొందేవారు.
అప్పట్లో బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి ఎంతో అద్భుతమైన సినిమాలు వచ్చేవి అయితే ఈ సినిమాలకు పోటీగా సౌత్ సినిమాలు వచ్చినప్పటికీ ఎంతోమంది సౌత్ సినిమాలను ఎగతాళి చేసేవారు.ఈ క్రమంలోనే ఈ నార్త్ సౌత్ ఇండస్ట్రీల గురించి యశ్ మాట్లాడుతూ.
గతంలో సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలను చూసి బాలీవుడ్ ప్రేక్షకులు ఎగతాళి చేసేవారు.అయితే ప్రస్తుతం పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయని ఈయన పేర్కొన్నారు.
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయని ఈయన పేర్కొన్నారు.

ఇలా సౌత్ సినిమాలకు ఇలాంటి ఆదరణ రావడానికి ఎస్ ఎస్ రాజమౌళి కారణమని యశ్ పేర్కొన్నారు.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ రానా అనుష్క నటించిన బాహుబలి సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు సౌత్ సినిమాలను అర్థం చేసుకొని ఎంతగానో ఆదరించారు.
ఈ సినిమా తర్వాత సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాయి.ప్రస్తుతం ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలు అనే క్రెడిట్ తీసుకువచ్చినది రాజమౌళి అంటూ ఈయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.







