కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.హత్నీకుండ్ నుంచి పరిమిత పరిమాణంలో నీటిని విడుదల చేయాలన్నారు.
యమునా నదిలో నీటిమట్టం మరింత పెరగకుండా చూడాలని లేఖలో కోరారు.ఢిల్లీలో జీ 20 శిఖరాగ్ర సమావేశం జరగబోతుందన్న ఆయన ఢిల్లీలో వరదలు వస్తే ప్రపంచానికి మంచి సందేశం ఇవ్వదని వెల్లడించారు.
కాగా ఉత్తరాదిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యమునా నదీలో నీటిమట్టం ప్రమాదకరస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.