మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అభివృద్దిని చూసి పొంగులేటి తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు.
ఉడత ఊపులకు భయపడేది లేదని మంత్రి పువ్వాడ తెలిపారు.ఆత్మీయ సమ్మేళనంతో రూ.కోట్లు సంపాదించారని ఆరోపించారు.పొంగులేటికి పాపం సొమ్ము బాగా చేరిందన్న ఆయన అందుకే మాటలు పేల్చుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ నేతలు ఎప్పటికీ అమ్ముడుపోరని తెలిపారు.పొంగులేటి పక్కన రౌడీషీటర్లు, గంజాయి, దోపిడీ దారులున్నారన్నారు.
రౌడీ షీటర్లను అణచివేస్తామని వెల్లడించారు.