ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం ఆదిపురుష్ రిలీజ్ కోసం రెడీగా ఉన్నాడు.ఈమధ్యనే సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.
అయితే ఈ సినిమా తర్వా ప్రభాస్ సలార్ సినిమా( Salaar ) కూడా రాబోతుంది.నెక్స్ట్ మంత్ ఆదిపురుష్ రిలీజ్ ఉండగా సెప్టెంబర్ లోనే సలార్ పార్ట్ 1 వస్తుందని తెలుస్తుంది.
అయితే సలార్ సినిమా వాయిదా వార్తలు జోరందుకున్నాయి.ఇందులో ఎంత నిజం ఉంది అన్నది తెలియదు కానీ ఈ న్యూస్ ల వెనుక రీజన్ మాత్రం ఏంటన్నది తెలుస్తుంది.
ఆదిపురుష్ సినిమా ఆధ్యాత్మిక కథతో వస్తుంది.ప్రభాస్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ కి ఈ కథ ఎంత మేరకు ఎక్కుతుందో తెలియదు.
అయితే ఆదిపురుష్ సలార్ ఈ సినిమాలు రెండు నెలల గ్యాప్ తో వస్తుందని తెలియగా ఆదిపురుష్ ని( Adipurush ) లైట్ తీసుకున్నారు.అందుకే సలార్ వాయిదా అనే వార్తలు వస్తే ఆదిపురుష్ మీద ఫ్యాన్స్ ఫోకస్ ఏర్పడుతుందని అలా చెబుతున్నారట.అయితే ప్రభాస్ నార్త్ ఫ్యాన్స్ మాత్రం సలార్ మీద కన్నా ఆదిపురుష్ మీద ఎక్కువ గురి పెట్టుకున్నారు.ఈ సినిమాతో ప్రభాస్ స్టామినా మరోసారి పాన్ ఇండియా వైడ్ చూపిస్తాడని అంటున్నారు.
సలార్ సెప్టెంబర్ రిలీజ్ ఉన్నా లేకపోయినా సరే ఆదిపురుష్ మాత్రం రికార్డులు సృష్టిస్తుందని చెబుతున్నారు ప్రభాస్ నార్త్ ఫ్యాన్స్.