విభజన సమస్యలపై రేపు కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది.ఈ భేటీకి ఏపీ నుంచి సీఎస్ సమీర్ శర్మ, విభజన వ్యవహారాల స్పెషల్ సెక్రటరీ హేమచంద్రలు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఏడు సమస్యలతో పాటు ఏపీకి సంబంధించిన ఏడు అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.అదేవిధంగా రాజధాని నిర్మాణం నిధులపైనా భేటీలో చర్చించనున్నారని సమాచారం.