తిరుపతిలో సీఎం జగన్ పర్యటించనున్నారు.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ఆయన ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
పర్యటనలో భాగంగా ముందుగా తిరుమలకు చేరుకోనున్న జగన్.సాయంత్రం 5:20 గంటలకు గంగమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.అనంతరం అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తారు.కాగా ఈ బస్సులు తిరుపతి నుంచి తిరుమల మధ్య నడవనున్నాయని అధికారులు తెలిపారు.రాత్రి 7:45 గంటలకు బేడీ ఆంజనేయ స్వామి వారిని జగన్ దర్శించుకోనున్నారు.అనంతరం తిరుమల స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి.
ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.