నా భర్త ఆచూకి తెలియజేయండి :మాజీ కార్పొరేటర్ భార్య కల్పన ఆవేదన

పోలీస్‌ స్టేషన్‌కు వెల్ళివస్తానని వెళ్ళిన నా భర్త జంగం భాస్కర్‌ (మాజీ కార్పొరేటర్‌) ఇంతవరకు తిరిగి రాలేదని పోలీసులే కనబడకుండా చేశారని ఆరోపిస్తూ నా భర్త ఆచూకి తెలియజేయాలని జంగం కల్పన వేడుకుంది.స్థానిక ఖమ్మం నగరంలో ని ప్రెస్‌క్లబ్‌లో బహుజన జేఏసి నాయకులతో కలిసి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.

 Let Me Know Where My Husband Is: Ex-corporator Wife Kalpana Avedana-TeluguStop.com

సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌పై నా మీద కేసు పెట్టారని నేను రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి వస్తానని వెళ్ళిన జంగం భాస్కర్‌ తిరిగి రాలేదని, ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తుండడంతో భార్యనైన నేను ఖమ్మం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళితే పోలీసులే చిత్రహింసలకు గురిచేసి కనబడకుండా చేశారని, ఎసై, రూరల్‌ సిఐని అడిగితే లేడని చెప్పడంతో బాగా ఏడ్చేసరికి చాలా మంది వచ్చారు.ఇంతలో వచ్చిన రూరల్‌ ఏసిపి భూతులు, కులంపేరుతో ధూషించాడని ఆరోపించింది.

ఏసిపి ఆదేశాలతో సిఐ కులంపేరుతో తిడుతూ జీప్‌ దగ్గరకు చేయిపట్టి లాక్కెళ్ళాడని ఆరోపించింది.ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసి బహుజన నాయకులు మాట్లాడుతూ.

అగ్రవర్ణాల రాజకీయ కుట్రలో ఎస్సీ,ఎస్టీ, బిసి నాయకులు బలిపశువులవుతున్నారన్నారు.నిజాయితీగా ఉండే దళిత నాయకుడు జంగం భాస్కర్‌పై అగ్రవర్ణాలవారి కుట్రలో, వత్తిడితో అధికారులు అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.పోలీసులు చట్టబద్దంగా వ్యవహరించి, దర్యాప్తు ముమ్మరం చేసి జంగం భాస్కర్‌ ఆచూకి తెలియజేయాలని, లేనియెడం బహుజనులంతా ఏకమై ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

విలేఖరుల సమావేశంలో ఎమ్మార్పిఎస్ రాష్ట్ర నాయకులు బచ్చలకూరి వెంకటేశ్వర్లు, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు ముడుసు జాకబ్, గుంతేటి వీరభద్రం, కందుల ఉపేందర్, ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ భద్రూనాయక్, ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాలకుర్తి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube