ఆసియా ఖండంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ ఏదంటే ఆసియా కప్.ఈ ఆసియా కప్ టోర్నమెంట్ ఆగస్టు 31న ప్రారంభమై, సెప్టెంబర్ 17 వరకు జరుగనుంది.
నిజానికి ఈ టోర్నమెంట్ మొత్తం పాకిస్తాన్ వేదికగా జరగాలి.కానీ కొన్ని భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ తో పాటు శ్రీలంకలో ఈ ఆసియా కప్ నిర్వహించనున్నారు.
ఇందులో పాకిస్తాన్లో నాలుగు మ్యాచ్లు, శ్రీలంకలో (Sri Lanka)ఫైనల్ మ్యాచ్ ను కలుపుకొని 9 మ్యాచ్లు జరపనున్నారు.ఈ ఆసియా కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, శ్రీలంక, నేపాల్ జట్లు పాల్గొంటాయి.
ఆసియా కప్ టైటిల్ ను అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది.భారత్ ఇప్పటివరకు ఏడుసార్లు ఆసియా కప్ టైటిల్ గెలిచింది.శ్రీలంక ఆసియా కప్ ను ఆరుసార్లు గెలిచి రెండవ స్థానంలో నిలిచింది.ఆసియా కప్( Asia Cup ) లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య నిలిచాడు.
జయసూర్య( Jayasurya ) 24 ఇన్నింగ్స్ ఆడి 1220 పరుగులు చేశాడు.ఇందులో ఆరు సెంచరీలు, మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి.ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన రెండవ ఆటగాడిగా శ్రీలంక మాజీ ప్లేయర్ కుమార సంగక్కర నిలిచాడు.ఇతను 23 ఇన్నింగ్స్ ఆడి 1075 పరుగులు చేశాడు.
ఆసియా కప్ లో అత్యధిక పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా భారత జట్టు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar) నిలిచాడు.సచిన్ 21 ఇన్నింగ్స్ ఆడి 971 పరుగులు చేశాడు.ఈ జాబితాలో నాలుగవ స్థానంలో పాకిస్తాన్ జట్టు ప్లేయర్ షోయాబ్ మాలిక్ నిలిచాడు.ఇతను 15 ఇన్నింగ్స్ ఆడి 786 పరుగులు చేశాడు.ఈ జాబితాలో ఐదవ స్థానంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు.రోహిత్ శర్మ 21 ఇన్నింగ్స్ ఆడి 754 పరుగులు చేశాడు.
మహేంద్రసింగ్ ధోని 16 ఇన్నింగ్స్ లలో 648 పరుగులు చేసి ఈ జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు.విరాట్ కోహ్లీ 10 ఇన్నింగ్స్ ఆడి 613 పరుగులు చేశాడు.
కానీ ఆసియా కప్ టాప్ 10 అత్యధిక పరుగుల జాబితాలో కోహ్లీ లేకపోవడం గమనార్హం.