దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా గత రెండు దశాబ్దాలుగా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి వారిలో నటి త్రిష ( Trisha )ఒకరు.ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు పైన అయినప్పటికీ ఇంకా అవకాశాలను అందుకుంటు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
మే 4వ తేదీ త్రిష తన 40వ పుట్టినరోజు( Birthday ) వేడుకలను జరుపుకున్నారు.ఇలా నాలుగు పదుల వయసులోకి అడుగుపెట్టినప్పటికీ ఈమె పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచించకుండా నటన పైనే ఫోకస్ పెట్టారు.
ఇక త్రిష పుట్టినరోజు సందర్భంగా గతంలో ఈమె చేసిన కొన్ని కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నిజానికి తనకు సినిమాలలోకి రావాలని ఆసక్తి ఏమాత్రం లేదని గతంలో త్రిష ఓసారి తెలియజేశారు.అయితే కాల ప్రభావం కారణంగా తాను సినిమాలలోకి అడుగు పెట్టానని ఈమె వెల్లడించారు.ఒకవేళ త్రిష ఇండస్ట్రీలోకి కనుక రాకపోయి ఉంటే ఒక అందమైన హీరోయిన్ ను చిత్ర పరిశ్రమ కోల్పోయేదని చెప్పాలి.
ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి త్రిష అబ్బాయిల గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

చాలామంది అమ్మాయిలు( girls ) మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టమంటారు.నిజానికి అబ్బాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని త్రిష తెలిపారు.వారు మనసులో ఒక ఆలోచన ఉంటూ బయటకు మరోలా ప్రవర్తిస్తారని తెలియజేశారు.
ఇక తనకు చాలామంది అబ్బాయిలు కూడా స్నేహితులు ఉన్నారని తెలిపారు.అయితే తనకు కూడా ఒకరోజు అబ్బాయిగా పుట్టాలని చాలా కోరికగా ఉందని త్రిష వెల్లడించారు.
అబ్బాయిగా పుట్టాలని కోరిక కేవలం అబ్బాయిల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవడం కోసమే అలా పుట్టాలని కోరుకుంటానంటూ ఈ సందర్భంగా అబ్బాయిల మనస్తత్వం గురించి త్రిష చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







