ఇండియాలో సినిమాతో పాటుగా క్రికెట్ కి అద్భుతమైన క్రేజ్ ఉంది.ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏ ప్లేయర్ అయిన అద్భుతమైన ఆట తీరు ప్రదర్శిస్తే.
దేశవ్యాప్తంగా అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంటది.సినిమా హీరోల మాదిరిగానే క్రికెట్ ప్లేయర్లను భారతీయులు ఎక్కువగా అభిమానిస్తుంటారు.
ఈ రకంగానే ఇండియా టీంలో అత్యధికంగా విరాట్ కోహ్లీ దేశవ్యాప్తంగా విపరీతమైన అభిమానులను తన ఆట తీరుతో సంపాదించుకోవడం జరిగింది.స్వదేశంలో అయినా విదేశంలో అయినా ఎటువంటి బౌలర్ అయిన.
తన దూకుడు ఆటతో.అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ.
అనేక ఇంటర్నేషనల్ రికార్డులు తన పేరు నమోదు చేసుకోవడం జరిగింది.మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్( Sachin Tendulkar ) పై ఉన్న చాలా రికార్డులు విరాట్ కోహ్లీ( Virat Kohli ) బ్రేక్ చేశాడు.

అంతర్జాతీయ స్థాయిలో అతి తక్కువ సమయంలోనే అత్యధికమైన పరుగులు చేసిన ఆటగాడుగా.కోహ్లీ పేరిట అనేక రికార్డులు ఉన్నాయి.అటువంటి కోహ్లీ గురించి.ఫస్ట్ కోచ్ తాజాగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.విరాట్ కోహ్లీ ఫస్ట్ కోచ్ రాజ్ కుమార్ ( Raj Kumar )ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… కోహ్లీ 2002/03 స్లామ్ బుక్ లో భారత్ క్రికెటర్ అవ్వాలని రాయటం జరిగింది.ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడటం జరిగింది.
ఈ క్రమంలో కోహ్లీ అనీ ఫార్మేట్ లకు కెప్టెన్ అయిన సమయంలో నాకు ఫోన్ చేయడం జరిగింది.కిట్ బ్యాగ్ తో సైకిల్ పై వచ్చే నేను… ఇక్కడికి చేరుకుంటానని నేను అనుకోలేదు…అని చెప్పటంతో చాలా ఎమోషనల్ అయ్యా అని రాజ్ కుమార్ ఇటీవల తెలియజేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ప్రస్తుతం ఐపీఎల్ టోర్నీ జరుగుతోంది.
ఆర్సిబి తరఫున.విరాట్ కోహ్లీ గేమ్ ఆడుతున్నాడు.







