సినిమా ఇండస్ట్రీ లోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి ఆ తరువాత హీరోగా మారి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న హీరోల్లో తరుణ్( Tarun ) ఒకరు.ఆయన విజయ భాస్కర్( Vijaya Bhaskar ) డైరెక్షన్ లో వచ్చిన నువ్వే కావాలి సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు ఆ సినిమాతో మంచి సక్సెస్ కొట్టి ఆ తరువాత వరసగా సినిమాలు చేస్తూ లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.
ఇక ఆ తర్వాత పెద్ద పెద్ద బ్యానర్లపై వరుస సినిమాలు చేస్తున్న తరుణ్.ప్రియమైన నీకు సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత నువ్వు లేక నేను లేను సినిమా మరొక సూపర్ హిట్ కొట్టింది…అలా తరుణ్ వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు.
ఇదే క్రమంలో అప్పట్లో ఆర్తీ అగర్వాల్( Arti Agarwal ) తో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి.వీళ్ళిద్దరూ కలిసి రవి బాబు( Ravi Babu ) డైరెక్షన్ లో సోగ్గాడు అనే సినిమా కూడా చేశారు.
కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద గా ఆడలేకపోయింది.

ఇక ఆర్తి అగర్వాల్ మ్యాటర్ క్లోజ్ అయ్యాక ఆయన నవవసంతం అనే సినిమా చేసాడు.అందులో హీరోయిన్ గా ప్రియమణి నటించింది అయితే స్క్రీన్ మీద వీళ్లిద్దరి కెమిస్ట్రీ బాగుండటం తో వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అంటూ చాలా న్యూస్ లు బయటకి వచ్చాయి దాంతో తరుణ్ ప్రియమణి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు,తొందర్లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ చాలా పుకార్లు వచ్చాయి…దింతో తరుణ్ వాళ్ళ అమ్మ అయిన రోజా రమణి స్వయంగా ప్రియామణి దగ్గరికి వెళ్లి నిజంగా నువ్వు నా కొడుకుని ఇష్టపడితే చెప్పు

మీ ఇద్దరి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట, దాంతో ఒక్కసారి గా ప్రియమణి షాక్ అయిందట.అప్పుడు ప్రియమణి రోజారమని గారి తో మాట్లాడుతూ మీరు చెప్పే వరకు మా గురించి ఇలా అందరు అనుకుంటున్నారని నాకు తెలియదు తరుణ్ తో ఒక సినిమాలో నటిస్తే ఇలాంటి రూమర్లు వచ్చాయని ఆ న్యూస్ లో వాస్తవం లేదని ప్రియమణి క్లారిటీ ఇచ్చింది.దాంతో అందరికి వీళ్ల విషయం లో ఉన్న ఒక కన్ఫ్యూజన్ అనేది విడిపోయింది అనే చెప్పాలి…
.