ఏఎన్ఆర్ రిజెక్ట్ చేసిన ఆ సినిమాను.. ఎన్టీఆర్ చేసి సూపర్ హిట్ అందుకున్నారట తెలుసా?

సాధారణంగా ఒక హీరో కథ నచ్చక రిజెక్ట్ చేసిన సినిమాను మరో హీరో చేసి సూపర్ హిట్ అందుకోవడం చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.

అచ్చంగా ఇలాగే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సమయంలో ఏఎన్ఆర్ రిజెక్ట్ చేసిన ఒక సినిమాను తర్వాత ఎన్టీఆర్ చేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.

ఇక సినిమా వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు కెరీర్లో ఎన్నో మైలురాళ్లు లాంటి సినిమాలు ఉన్నాయి.అందులో ప్రేక్షకులకు బాగా గుర్తుండేది రాముడు భీముడు సినిమా.1964 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు.సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించిన తర్వాత నిర్మాత రామానాయుడు నిర్మించిన తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం.

ఇక ఈ సినిమా సూపర్ డూపర్ విజయాన్ని సాధించడంతో అటు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కి మంచి ఆరంభం లభించిందనే చెప్పాలి.అయితే ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా దర్శకనిర్మాతలు ముందుగా అక్కినేని నాగేశ్వరరావు తో చేయాలని అనుకున్నారట.

అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ఏ ఎన్ ఆర్ కు వినిపించగా ఆయనకు కథ బాగా నచ్చింది.

Advertisement

కానీ ఈ సినిమా నేను చేయను అంటూ నాగేశ్వరరావు రిజెక్ట్ చేశారట.అయితే ఆయన కథను రిజెక్ట్ చేయడానికి ఒక పెద్ద కారణం కూడా ఉందట. రాముడు భీముడు అనే కథను మొదట జానపద కథ రాశారట.

ప్రీజనల్ ఆఫ్ జెండా అనే ఇంగ్లీష్ నవల వేదం వెంకటరాయ శాస్త్రి రచించిన ప్రతాపరుద్రీయం అనే నాటకం రెండూ కలగలిపి రాముడు భీముడు అనే జానపద కథను సిద్ధం చేశారట రచయిత డి.వి.నరసరాజు.ఇక ఆ తర్వాత కాలంలో నరసరాజు రాముడు భీముడు కథను సాంఘికంగా మార్చాలనే ఆలోచన వచ్చిందట.

ఆలోచన రావడమే తడవు తక్కువ సమయంలోనే స్క్రిప్ట్ను పూర్తిచేశారు.ఈ క్రమంలోనే ఇక అక్కినేనికి కథ వినిపించారు నరసరాజు.

కానీ కథ నచ్చిన ఆయన రిజెక్ట్ చేశారు.ఎందుకంటే ఆయన అప్పుడు బిజీగా ఉండటమే.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

నేను బిజీగా ఉన్నాను.జగన్నాధ రావు కి కాల్ షీట్లు ఇవ్వలేను.

Advertisement

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కూడా సినిమాలో నటించలేదు.కథ నచ్చలేదని దర్శకుడికి కూడా చెబుతాను అంటూ రచయితతో చెప్పారట ఏఎన్ఆర్.

ఇక ఆ తర్వాత కాలంలో ఇదే స్క్రిప్టు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో తాపీ చాణక్య దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కింది.ఇక ఎన్టీఆర్ అన్నదమ్ములుగా డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమా సూపర్ డూపర్ విజయాన్ని సాధించింది అని చెప్పాలి.

తాజా వార్తలు