1.తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శం
ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శమని గవర్నర్ తమిళ సై అన్నారు.
2.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి.కొత్తగా 22,775 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
3.తమిళనాడు లో ఒమి క్రాన్ కేసులు.కఠిన ఆంక్షలు
తమిళనాడులో ఒమి క్రాన్ కేసులు దాదాపు 20 వరకు నమోదు కావడంతో తమిళనాడులో కఠినమైన ఆంక్షలు విధించాలని అధికారులకు సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.
4.భారత్ లో ఒమి క్రాన్
భారత్ లో గడిచిన 24 గంటల్లో 1431 కరోనా ఒమి క్రాన్ కేసులు నమోదు అయ్యాయి.
5.నేటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 81 వ అఖిలభారత పారిశ్రామిక ఎగ్జిబిషన్ ను తెలంగాణ గవర్నర్ తమిళ సై ప్రారంభించనున్నారు.
6.ఆరుగురు మావోయిస్ట్ మిలిషియా సభ్యులు అరెస్ట్
తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దులో ములుగు జిల్లా వెంకటాపురం మండలం లోని తిప్పా పురం – పెద్ద ఉట్ల పల్లి గ్రామాల మధ్య ఆరుగురు మావోయిస్ట్ మిలిషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
7.రాజ్ భవన్ లో ఫిర్యాదు బాక్స్
తెలంగాణలోని ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు గవర్నర్ తమిళిసై ప్రయత్నిస్తున్నారు దీనిలో భాగంగానే రాజ్ భవన్ లో ఫిర్యాదు బాక్స్ ను ఆమె ఏర్పాటు చేయించారు….
8.ఏపీలో కరోనా
ఏపీ వ్యాప్తంగా కొత్తగా 166 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
9.ఎస్ టి యు డైరీ ఆవిష్కరణ
ఎస్కేయూ నూతన సంవత్సర డైరీ ని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు.
10 హరీష్ రావు కేసీఆర్ ఫోటోలకు పాలాభిషేకం
చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం జిఎస్టి పెంపుదల ను వాయిదా వేయడంతో , సిద్దిపేట చేనేత కార్మికులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
11.12 సంవత్సరాల లోపు పిల్లలకు నేడు ఉచిత ప్రయాణం
12 సంవత్సరాల లోపు పిల్లలకు నేడు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని తెలంగాణ లోని హుస్నాబాద్ ఆర్టీసీ కల్పించింది.
13.ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవం
ఎస్ఎఫ్ఐ 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చేర్యాల లో ఘనంగా నిర్వహించారు.
14.జగన్ ఆగ్రహం
ప్రతిపక్షాల పై ఏపీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మంచి చేస్తా ఉంటే మంచిని విమర్శించేవారు ఉన్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
15.ఏపీలో పెన్షన్ కానుక ను ప్రారంభించిన జగన్
ఏపీలో పెన్షన్ కానుక ను సీఎం జగన్ ప్రారంభించారు.గుంటూరు జిల్లా ప్రత్తిపాడు లో జరిగిన సభలో జగన్ ప్రారంభించారు.
16.న్యూ ఇయర్ వేడుకల్లో చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయంలో నాయకుల మధ్య నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
17.తిరుమల సమాచారం
తిరుమల లో నేడు భక్తుల రద్దీ తగ్గింది.నిన్న కేవలం 20 వేల మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు.
18.రైతులకు 20 వేల కోట్లు విడుదల
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు దాదాపు 20,000 కోట్లను విడుదల చేసింది.
19.500 కోట్ల విలువైన శివలింగం స్వాధీనం
తమిళనాడులోని తంజావూరులో 500 కోట్ల విలువైన మరకత శివ లింగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,150
24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 49,150
.