డైరెక్షన్ స్థాయి గురించి చెప్పాలంటే ఆ సినిమా గురించి చెప్పాల్సిందే

తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో అద్భుత సినిమాలు వచ్చాయి.ఎన్నో సినిమాలు చక్కటి విజయాన్ని అందుకున్నాయి.

 Unknown Facts About Sagara Sangamam , Sagara Sangamam, Tollywood, Telugu Cinema-TeluguStop.com

అయితే అన్ని సినిమాల్లో దర్శకత్వ పరంగా వచ్చిన గొప్ప సినిమా ఏంటి అనే చర్చ జరిగింది సినీ పరిశ్రమలో.చాలా మంది సినిమా పెద్దలు చాలా సినిమాల గురించి చెప్పారు.

ఎవరికి నచ్చిన సినిమాల వారు ప్రస్తావించి.తాము చెప్పిన సినిమా ఎందుకు గొప్పదో వివరించే ప్రయత్నం చేశారు.

అయితే తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకత్వ పరంగా వచ్చిన గొప్ప సినిమా మాత్రం సాగరం సంగమం అని చెప్పుకోవచ్చు.

సాగర సంగమం సినిమా తెలుగులో అత్యంత గొప్ప సినిమాగా ఎలా నిలిచిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ సినిమా తొలి షాట్ లోనే మూవీ ఎలా ఉండబోతుందో వెల్లడించాడు దర్శకుడు.మొదటి సన్నివేశంలో హీరో గురించి ఒక చెప్పుతో చాలా క్లారిటీగా చూపించాడు.

విసిరి పడేయబడిన చెప్పు లాంటిది హీరో జీవితం అని వెల్లడించాడు.తెలుగు సినిమా అనేది ఎలా ఉండాలి? హీరో ఎలా ఉండాలి? అంటే.గతంలో సినిమాల మాదిగా ఉండడు అని చెప్పాడు దర్శకుడు.ముడతలు పడిన పాత లాల్చీ, బాగా తాగి తూలుతూ.కిల్లీ నములుతూ బలం లేని చేతులతో రిక్షా నెట్టుకుంటూ హీరో జనాలకు పరిచయం అవుతాడు.

Telugu Balu, Ilayaraja, Janakamma, Kamala Hassan, Sagara Sangamam, Telugu, Tolly

ఇదొక్కటే కాదు.సినిమాలోని చాలా సన్నివేశాలు.చాలా లోతుగా ఆవిష్కరించాడు దర్శకకుడు.

ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.

ఇళయరాజా సంగీతం, బాలు , జానకమ్మ గొంతు మరింత గొప్పతనం తీసుకొచ్చాయి.విశ్వనాధ్ దర్శకత్వ పని తీరు ఈ సినిమాకు గొప్పగా ప్రాణం పోశాయి.

ఈ సినిమా అప్పట్లో విడుదలై గొప్ప ప్రభంజనం కలిగించింది.దక్షిణాదిలోని అన్ని భాషల్లో 100 రోజులు ఆడిన సినిమాగా ఇది రికార్డు సాధించింది.

ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి ఎంతగానో గుర్తింపు తెచ్చింది ఈ సినిమా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube