ఎన్టీఆర్ విజయనిర్మల ను అంత మాట అన్నాడా ?

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణతెలుగు సినిమా పరిశ్రమను ఏటిన నటులు.1960 నుంచి 1990 వరకు తెలుగు సినిమా పరిశ్రమలో వీరి హవా ఓ రేంజిలో ఉంది.వరుస సినిమాలతో వీరు ఇండస్ట్రీలో అద్భుత విజయాలను అందుకున్నారు.ఈ ముగ్గురు హీరోలు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే వారు.అంతేకాదు పోటా పోటీగా సినిమాలు చేసేవారు.తొలినాళ్లలో వీరి మధ్య మంచి స్నేహం ఉండేది.

 Ntr Comments On Actress Vijaya Nirmala ,ntr Comments , Vijaya Nirmala, Krishna ,-TeluguStop.com

ఆ తర్వాత ఎన్టీఆర్ కు పోటీగా కృష్ణ ఢీ అంటే ఢీ అన్నాడు.సినిమా రంగంలోనూ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నించాడు.

ఎన్టీఆర్ సినిమాలకు పోటీగా తను సినిమాలు విడుదల చేసేవాడు.ఎన్టీఆర్ ఏ రకమైన కృష్ణ కూడా అలాంటి సినిమాలే చేసి రిలీజ్ చేసేవాడు.

ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ అప్పట్లో ఓ రేంజిలో విడుదల అయ్యింది.దానికి పోటీ కృష్ణ కురుక్షేత్రం సినిమాను విడుదల చేశాడు.అనంతరం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమం
త్రి అయ్యారు.కృష్ణ కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీ చేశాడు.

ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో ప్రసంగాలు చేసేవారు.

Telugu Danaveera, Krishna, Ntr, Potics, Tollywood, Vijaya Nirmala-Latest News -

1989 ఎన్నికలలో ఎన్టీఆర్ ఓడిపోయారు.ఆ సమయంలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చాలా సినిమాలు వచ్చాయి.అందులో గండిపేట రహస్యం, రాజకీయ చదరంగం, మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి సినిమాలున్నాయి.

వీటిలో కొన్ని సినిమాలను కృష్ణ నిర్మించాడు.మరికొన్ని సినిమాల్లో ఆయన నటించారు.

ఈ చిత్రాలకు కృష్ణ భార్య విజయ నిర్మల దర్శకత్వం వహించారు.

Telugu Danaveera, Krishna, Ntr, Potics, Tollywood, Vijaya Nirmala-Latest News -

ఈ సినిమాలు అప్పట్లో చాలా సంచలనం కలిగించాయి.రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి.ఈ సినిమాలు విడుదల అయ్యాక ఓ వేడుకలో ఎన్టీఆర్ కు విజయ నిర్మల కనిపించారు.

వెంటనే తన దగ్గరికి వెళ్లి ఓ మాట అన్నాడు.ఏవమ్మా.

ఇంకా నా మీద తీయడానికి ఏమైన మిగిలిందా? అన్నాడు నవ్వుతూ.అప్పట్లో ఈ విషయం బాగా సంచలనం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube