ఎన్టీఆర్ విజయనిర్మల ను అంత మాట అన్నాడా ?

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణతెలుగు సినిమా పరిశ్రమను ఏటిన నటులు.1960 నుంచి 1990 వరకు తెలుగు సినిమా పరిశ్రమలో వీరి హవా ఓ రేంజిలో ఉంది.

వరుస సినిమాలతో వీరు ఇండస్ట్రీలో అద్భుత విజయాలను అందుకున్నారు.ఈ ముగ్గురు హీరోలు ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే వారు.

అంతేకాదు పోటా పోటీగా సినిమాలు చేసేవారు.తొలినాళ్లలో వీరి మధ్య మంచి స్నేహం ఉండేది.

ఆ తర్వాత ఎన్టీఆర్ కు పోటీగా కృష్ణ ఢీ అంటే ఢీ అన్నాడు.

సినిమా రంగంలోనూ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నించాడు.ఎన్టీఆర్ సినిమాలకు పోటీగా తను సినిమాలు విడుదల చేసేవాడు.

ఎన్టీఆర్ ఏ రకమైన కృష్ణ కూడా అలాంటి సినిమాలే చేసి రిలీజ్ చేసేవాడు.

ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ అప్పట్లో ఓ రేంజిలో విడుదల అయ్యింది.

దానికి పోటీ కృష్ణ కురుక్షేత్రం సినిమాను విడుదల చేశాడు.అనంతరం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు.

కృష్ణ కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీ చేశాడు.ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారంలో ప్రసంగాలు చేసేవారు.

"""/"/ 1989 ఎన్నికలలో ఎన్టీఆర్ ఓడిపోయారు.ఆ సమయంలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చాలా సినిమాలు వచ్చాయి.

అందులో గండిపేట రహస్యం, రాజకీయ చదరంగం, మండలాధీశుడు, సాహసమే నా ఊపిరి సినిమాలున్నాయి.

వీటిలో కొన్ని సినిమాలను కృష్ణ నిర్మించాడు.మరికొన్ని సినిమాల్లో ఆయన నటించారు.

ఈ చిత్రాలకు కృష్ణ భార్య విజయ నిర్మల దర్శకత్వం వహించారు. """/"/ ఈ సినిమాలు అప్పట్లో చాలా సంచలనం కలిగించాయి.

రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి.ఈ సినిమాలు విడుదల అయ్యాక ఓ వేడుకలో ఎన్టీఆర్ కు విజయ నిర్మల కనిపించారు.

వెంటనే తన దగ్గరికి వెళ్లి ఓ మాట అన్నాడు.ఏవమ్మా.

ఇంకా నా మీద తీయడానికి ఏమైన మిగిలిందా? అన్నాడు నవ్వుతూ.అప్పట్లో ఈ విషయం బాగా సంచలనం అయ్యింది.

నా అఛీవ్ మెంట్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్ వైరల్!