Manjula Nirupam: అనారోగ్యం అంటూ ప్రాంక్ చేసిన భార్య.. రివేంజ్ తీర్చుకున్న డాక్టర్ బాబు వీడియో వైరల్!

Nirupam Paritala Prank On Manula Paritala Video Viral On Internet Details, Doctor Babu, Nirupam Paritala, Manjula Paritala, Nirupam Paritala Prank, Karthika Deepam , Manjula Nirupam, Manjula Nirupam Prank Video

ఈమధ్య సోషల్ మీడియా ప్రభావం బాగా ఉండటంతో ప్రతి ఒక్క యూజర్లు సోషల్ మీడియా ద్వారా వీడియోలు చేస్తూ సందడి చేస్తున్నారు.ముఖ్యంగా సెలబ్రెటీలు మాత్రం సోషల్ మీడియాని తెగ వాడేసుకుంటున్నారు.

 Nirupam Paritala Prank On Manula Paritala Video Viral On Internet Details, Docto-TeluguStop.com

పైగా యూట్యూబ్ లలో ఛానెల్స్ క్రియేట్ చేసుకుని తాము చేసే పనులన్నీ వీడియో తీస్తూ ఫాలోవర్స్ కి పంచుకుంటున్నారు.

అయితే ఈ మధ్య ప్రాంక్ వీడియోలు అంటూ బాగా హల్ చల్ చేస్తున్నారు.

రోడ్లపై ప్రాంక్ వీడియోస్ చేస్తూ జనాలను పిచ్చోళ్లా చేస్తున్నారు.అయితే ప్రాంక్ వీడియోలు చూడటానికి బాగానే ఉన్నప్పటికీ కానీ కొన్ని సమయాలలో మాత్రం ఎమోషన్స్ తో ఆడుకుంటాయి.

ప్రాంక్ అంటూ కొందరి ఎమోషనల్ తో ఆడుకుంటారు.

అలా తాజాగా ఓ సెలబ్రెటీ జంట కూడా తమ ప్రాంక్ తో అందర్నీ షాక్ అయ్యేలా చేశారు.

ఇంతకూ వాళ్ళు ఎవరో కాదు.బుల్లితెర నటుడు నిరూపమ్ పరిటాల.

కార్తీకదీపం సీరియల్ తో డాక్టర్ బాబుగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో మంచి అభిమాన హీరోగా మిగిలాడు.ఇదివరకు పలు సీరియల్స్ లో నటించినప్పటికీ ఈయనకు కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి పేరు వచ్చింది.

అయితే ఈయన భార్య మంజుల కూడా బుల్లితెర నటి.ఈమె కూడా పలు సీరియల్స్ లలో చేసి నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.ఇక వీరిద్దరూ గతంలో ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఒక బాబు ఉన్నాడు.అయితే ఈ బుల్లితెర జంట సోషల్ మీడియాలలో బాగా యాక్టివ్ గా ఉంటారు.

మంజుల మాత్రం యూట్యూబ్ వీడియోలతో బాగా సందడి చేస్తుంది.

ఇక వీరికి తమ పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఉండగా.

ఇప్పటికీ ఎన్నో వీడియోస్ పంచుకున్నారు.వీరికి సోషల్ మీడియా వేదికగా కూడా మంచి అభిమానం ఉంది.

వీళ్ళు షేర్ చేసే వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.అయితే తాజాగా మంజుల ఒక వీడియో పంచుకుంది.

అది ఏంటంటే తన భర్త పై ప్రాంక్ వీడియో చేసింది.ఇక ఆ వీడియోలో తను మాట్లాడుతూ.ఎన్నో సార్లు ప్రాంక్ చేయాలని అనుకుందట.కానీ ఎప్పుడు కుదరలేదని అయితే ఈసారి ఎలాగైనా చేయాలి అని అనుకుందట.

ఇక వారు ఒక షోలో భాగంగా డాన్స్ చేయడానికి ప్రాక్టీస్ చేయడానికి డాన్స్ క్లాస్ కి వెళ్లారు.

అక్కడ మంజుల ఉన్నట్టుండి కింద పడిపోవటంతో వెంటనే నిరూపమ్ తనని పట్టుకొని అలాగే ఉండిపోయాడు.కనీసం ఎటువంటి ఎమోషన్స్ కూడా చూయించినట్లు అనిపించలేదు.అంటే తను ఉపవాసంలో ఉంది కాబట్టి కళ్ళు తిరిగి కింద పడిపోయిందేమో అని అనుకున్నాడట డాక్టర్ బాబు.

ఈ విషయాన్ని వీడియో లాస్ట్ లో తెలిపాడు.

అలాగే తన భార్యని చేతులో పట్టుకోగా.

వెంటనే మంజుల దూరం జరిగి తెగ నవ్వింది.అదంతా ప్రాంక్ అంటూ అందరికీ సారీ చెప్పింది.

ఇక నిరూపమ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా కాసేపు సైలెంట్ గా ఉన్నాడు.ఆ తర్వాత తనకు కాస్త క్లాస్ పీకినట్లే కనిపించాడు.

దీంతో అతడు కూడా వెంటనే రివేంజ్ తీర్చుకోవాలి అని తనను బయట కారులో కూర్చోబెట్టి కాఫీ షాప్ కి వెళ్లి కోల్డ్ కాఫీ అంటూ దానిని వరస్ట్ గా తయారు చేయించి తన భార్య దగ్గరికి వచ్చి తాపించాడు.తను ఆ టేస్ట్ చూసి రివేంజ్ తీర్చుకున్నాడు అని తెలుసుకుంది.

అలా వీడియో మొత్తం చాలా సరదాగా సాగింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube