సూపర్ స్టార్ మహేష్ బాబు తో ప్రస్తుతం త్రివిక్రమ్ రూపొందిస్తున్న చిత్రం గుంటూరు కారం( Guntur Karam ). ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమా లు ఎప్పుడు ప్రారంభం అయ్యాయో తెల్సిందే.
చాలా నెలల క్రితం షూటింగ్ ప్రారంభం అయినా కూడా ఇప్పటి వరకు అప్‌డేట్స్ ఇవ్వడం లేదు.అసలు సినిమా ను ఇప్పటికే పూర్తి చేసి విడుదల చేయాల్సి ఉన్నా కూడా త్రివిక్రమ్ బద్దకంగా వ్యవహరిస్తున్నాడు అటూ మహేష్ బాబు( Mahesh Babu ) అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు సినిమా షూటింగ్ పూర్తి చేయలేదు.
అంతే కాకుండా త్రివిక్రమ్( Trivikram Srinivas ) సినిమా నుండి పాటలను కూడా విడుదల చేయడం లేదు.సంక్రాంతికి సినిమా విడుదల అన్నారు.కానీ ఇప్పుడు ఆ సంక్రాంతికి కూడా సినిమా విడుదల అయ్యే అవకాశాలు లేవు.
ఇప్పటి వరకు గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల హడావుడి ఏమీ లేదు.హీరోయిన్ గా ఈ సినిమా లో శ్రీలీల( Sreeleela ) నటిస్తూ ఉండగా కీలక పాత్రలో మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కనిపించబోతుంది.
ఈ సినిమా లో మొదట పూజా హెగ్డే ను ఎంపిక చేయడం జరిగింది.కొన్ని సన్నివేశాల చిత్రీకరణ తర్వాత అనూహ్య పరిణామాల నేపథ్యం లో గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే( Pooja Hegde ) ను తొలగించడం జరిగింది.
హీరోయిన్ గా ఈ అమ్మడిని తొలగించడానికి కారణం ఏంటి అనేది త్రివిక్రమ్ తెలియజేయలేదు.శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా మారడం తో ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) సెకండ్ హీరోయిన్ గా మారింది.మొత్తానికి వీరిద్దరు మహేష్ బాబు సినిమా లో నటించడం ద్వారా ఇద్దరి కెరీర్ లు కూడా జిల్ జిల్ జిగా అన్నట్లుగా మెరువబోతున్నాయి అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.గుంటూరు కారం సినిమా ప్రమోషన్ విషయం లో మరియు షూటింగ్ విషయం లో త్రివిక్రమ్ ఇప్పటికి అయినా స్పీడ్ పెంచాలని అభిమానులు కోరుకుంటున్నారు.