బాలక్రిష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘ఎన్టీఆర్’ చిత్ర ఆడియో వేడుక తాజాగా జరిగింది.ఈ వేడుకకు నందమూరి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్‌తో కలిసి పని చేసిన నటీనటులు అంతా హాజరయ్యారు.
విభిన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బసవతారక పాత్రలో బాలీవుడ్ నటీమణి విద్యాబాలన్ నటించింది.ఈ చిత్ర ఆడియో వేడుకలో చాలా సేపు మాట్లాడిన బాలయ్య ఆచితూచి మాట్లాడినట్టు తెలుస్తోంది.

గతంలో బాలయ్య ఎప్పుడు మైక్ పట్టుకున్నా కూడా వివాదాస్పదం అవుతూ వస్తోంది.కానీ ఈ వేడుకలో అలా అయితే అసలుకే ప్రమాదం అని భావించిన బాలయ్య చాలా జాగ్రత్తగా మాట్లాడినట్టు కనిపిస్తోంది.ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలయ్య, ఈ వేడుకకు ఎన్టీఆర్ లుక్‌లోనే దర్శణం ఇవ్వడం ఇక ఎన్టీఆర్ ఆహార్యంతో మాట్లాడడానికి చాలా ప్రయత్నాలు చేశాడు.తన కుటుంబం గురించి, తన తండ్రి, తల్లి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు.

ఈ వేడుకలో బాలయ్య చాలా సేపు స్పీచు ఇస్తాడని అంతా అనుకున్నారు.అంతేకాకుండా మెగా బ్రదర్ నాగబాబు ఇటీవలె బాలక్రిష్ణ అంటే తనకెవరో తెలియదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు.గతంలో బాలయ్య కూడా పవన్‌కళ్యాణ్ అంటే ఎవరో తెలియదని అన్నాడు.ఇకపోతే ఈ సారికి నాగబాబుకు గట్టి కౌంటర్ ఇస్తాడని నందమూరి అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కానీ అన్నగాని ఆహార్యంతో మాట్లాడిన బాలయ్య ఇలా చేస్తే చిల్లర వ్యవహారంగా ఉంటుందని కాబోలు నాగబాబు వ్యాఖ్యల గురించి టాఫిక్ తీసుకురాలేదు.దాంతో నందమూరి అభిమానులు బాలయ్య ఇలా చేశాడేంటి! అనే ఆలోచనలో పడ్డారు.