ఏమైంది బాబూ ...? ఎవరూ మాట వినడం లేదా..?

టీడీపీ అధినేత … ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లో కోపం విపరీతంగా పెరిగిపియింది.ఎప్పుడూ లేనంత కోపం … అసహనం ఇప్పుడు ఆయన ప్రదర్శిస్తున్నాడు.పోనీలే అని మెత్తగా ఊరుకుంటే … నెత్తిన ఎక్కుతున్నారని బాబు ఇప్పుడు అకస్మాత్తుగా… కోపం పెంచేసుకున్నాడు.తాజాగా… పార్టీ … సమన్వయ కమిటీ సమావేశంలో.ఆ తర్వాత ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో.నేతలపై విరుచుకుపడ్డారు.అతి విశ్వాసంతో పార్టీని నట్టేట ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గుంటూరు.

 Chandrababu Naidu Warns Tdp Leaders In Ap-TeluguStop.com

చిత్తూరు జిల్లాల నేతలలో అతి విశ్వాసం పెరిగి, పార్టీ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ఎందుకు సీరియస్ గా తీసుకోవడంలేదని నిలదీశారు.

‘ఇప్పటి వరకు నేను సీరియస్ గా మాట్లాడితే మీరు బాధపడతారని ఆలోచించా.గట్టిగా మాట్లాడకపోతే ఇక ముందు నేను బాదపడాల్సి వస్తుంది.సున్నితంగా చెప్పినప్పుడే అర్దం చేసుకుని ముందుకు సాగాలి, రఫ్ గా మాట్లాడే వరకు తెచ్చుకోవద్దు.మీరు ఎంత బాధపడినా … ఫర్వాలేదు.కానీ నేను ఈ ఆరు నెలల కటువుగానే ఉంటా ‘ అని చంద్రబాబు స్పష్టం చేయడంతో.ఒక్కసారిగా అంత అయోమయానికి గురయ్యారు.

గతం లో ఎప్పుడూ లేనంత కోపం … చిరాకు బాబు లో ఎక్కువయ్యాయని పార్టీ నేతలు గుసగుసలాడుకున్నారు.తెలంగాణ ఎన్నికల అనంతరం ఏపీలో పార్టీ గెలుపు పై బాబుకి నమ్మకం తగ్గిపోయిందని … అందుకే ఇప్పుడు ఇంత హడావుడి చేస్తున్నాడని… సమావేశంలో పాల్గొన్న నాయకులు కొంతమంది చర్చించుకున్నారట.

ఇక బాబు విషయానికి వస్తే….సభ్యత్వ నమోదులో కొంతమంది నేతలు వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై కూడా చంద్రబాబు సీరియస్ గానే మాట్లాడారు.మీరు చేసే తప్పులకు పార్టీని నష్టపోనివ్వను.మీ వల్ల నేను ప్రజల్లో వీక్ అవుతున్నాను.మిమ్మల్ని గట్టిగా మందలిస్తే నేనైనా ప్రజల్లో బలపడతా.ఎవరు ఏమి అనుకున్నా నాకు ఫర్వాలేదు.ఈ ఆరు నెలలు ఇలాగే ఉంటా అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.అలాగే… గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నాడంటూ ఆరా తీశారు.శిద్ధా రాఘవరావు గాల్లోనే ఉన్నారని మండిపడ్డారు.తాడిపత్రి ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కు రాకపోవడం పై అసహనం వ్యక్తం చేస్తూ సీనియర్లు కూడా ఇన్ని సార్లు చెప్పించుకుంటే ఎలా అని నిలదీశారు.అతిశయం, అహంభావం పనికిరాదని, ఎప్పటికప్పుడు ఎవరి పనితీరు ఎలా ఉందో నివేదికలు తెప్పించుకుంటున్నాను అని బాబు వ్యాఖ్యానించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube