ఏపీపీఎస్సీ వరుస వరుసగా ఉద్యోగాల నోటిఫికెషన్స్ రిలీజ్ చేస్తూ…నిరుద్యోగుల కళ్ళల్లో వెలుగులు నింపుతోంది.తాజాగా….ఏపీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్ లోని 109 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.హోం సైన్స్, సోషల్ వర్క్ లో ఏదైనా డిగ్రీ కలిగిన అభ్యర్ధులు అర్హులుగా ప్రకటించింది.
ఏపీపీఎస్సీ వెబ్ సైట్ https://psc.ap.gov.inలో డిసెంబర్ 28 నుంచి జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

2018 జూలై 1 నాటికి 18 ఏళ్లు పూర్తయి 42 ఏళ్లు మించని వారు అర్హులు.పరీక్ష ఫీజును జనవరి 17వ తేది లోపు చెల్లించాలి.కొత్తగా ఏర్పడిన 100 పోస్టులతో పాటు క్యారీ ఫార్వర్డ్ లో 9 పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తుల సంఖ్య 25 వేలకు మించితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు.







