మనలో వచ్చే అనారోగ్య సమస్యల( Health problems ) గురించి శరీరం మనల్ని ముందుగానే హెచ్చరిస్తుంది.వీటిని లక్షణాలు అని చెబుతాం.
కొన్ని రకాల వ్యాధులకు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి.అయితే వీటిని ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే సమస్యను దూరం చేసుకోవచ్చు.
అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇలాంటి లక్షణాల్లో ఒకటి పాదాల నొప్పి( Foot pain ).సహజంగా పాదాల్లో నొప్పిని మనం లైట్ తీసుకుంటూ ఉంటాం.కానీ ఇది తీవ్రమైన వ్యాధికి దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పాదాల్లో నొప్పిగా ఉండడం అధిక కొలెస్ట్రాల్ కు సంకేతమని నిపుణులు చెబుతున్నారు.

అలాగే కాళ్లలో సరైన రక్తప్రసరణ( Blood Circulation ) లేని సమయంలో కాళ్లలో జలదరింపు నొప్పి ఉంటుందని చెబుతున్నారు.ఇది శరీరంలో కొవ్వు పెరుగుతోందని చెప్పడానికి సంకేతం.ఇక నెల రోజులకు పైగా నొప్పి కొనసాగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
అలాగే కాళ్లలో దీర్ఘకాలికంగా నొప్పి ఉంటే కాళ్లలో రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో పాటు కొలెస్ట్రాల్ పెరగడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు.ఇది గుండె సంబంధిత సమస్యలకు( heart related problems ) కూడా దారి తీస్తుంది.
నిపుణుల గణంకాల ప్రకారం భారతదేశంలో 25 నుంచి 30% మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు.

దీంతో గుండె పోటు పక్షవాతం లాంటి సమస్యలకు దారి తీస్తుంది.అయితే పెరిఫెరల్ ఆర్టరీ( Peripheral artery ) అనే సమస్య వలన కూడా పాదాలలో నొప్పి వేధిస్తుంది.ఇది కొంత సమయానికే దానంతట అదే తగ్గిపోతుంది.
ఎక్కువ కాలం పాటు కాళ్లు బిగుసుకుపోయి నొప్పి ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.సాధారణంగా ఉబకాయం లేదా 60 ఏళ్లు పై బడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
అయితే కాళ్లలో వాపు, నొప్పి తగ్గాలంటే కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి.ముఖ్యంగా అధికంగా కొవ్వు ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి.