ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. కొత్త ఆలోచనతో చేపలను ఎంత సులువుగా పట్టేస్తున్నారో

సాధారణంగా చేపలను( fish ) పట్టాలంటే చెరువుల్లో గాలం వేయడం లేదా వల వేయడం చేస్తారు.కానీ, ఆ ప్రాథమిక పద్ధతులను పక్కన పెట్టి కొత్త ప్రయోగాలతో చేపలను పట్టడం చూశారా? మన భారతీయుల సృజనాత్మకత ఇలాంటి ప్రత్యేకతల్లో బయటపడుతుంది.తాజాగా, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం యువకులు చేపల వేటలో వినూత్న పద్ధతిని అవలంబించారు.వలతో పనిలేకుండా, అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఈ కుర్రాళ్లు సాధారణంగా అందుబాటులో ఉండే వాటర్ బాటిల్‌ను ఉపయోగించి చేపలను పట్టుతున్నారు.

 How Do Ideas Like This Come About Is As Easy As Catching Fish With A New Idea, S-TeluguStop.com

రెండు లీటర్ల వాటర్ బాటిల్‌కు( water bottle ) తాడు కట్టి, బాటిల్‌లో మైదా పిండి పెట్టి గోదావరి నదిలోకి విసరడం వీరి సీక్రెట్ టెక్నిక్‌.

అలా విసిరేసిన వాటిని ఆహారం కోసం బాటిల్‌లోకి వెళ్లిన చేపలను చకచకా లాగేసి, సులువుగా బయటకు తీస్తున్నారు.ఈ పద్ధతితో ఏకంగా కిలో, రెండు కిలోల బరువున్న చేపలు బాటిల్‌లో చిక్కుతూ ఉండడంతో చేపలను పెట్టె వాళ్లకు లాభాలను అందిస్తున్నాయి.ఇక కొత్త పద్దతిలో చేపల వేట చూసి స్థానికులు ఫిదా అవుతున్నారు.యువకులు ఒక్కో చేపను రూ.500కు పైగా ధరకు విక్రయిస్తూ మంచి ఆదాయం సంపాదిస్తున్నారు.యానాం పరిసర ప్రాంతాల నుంచి మాంస ప్రియులు గోదావరి గట్టుకు చేరుకుని, లైవ్‌లో చేపలు కొనుగోలు చేస్తున్నారు.యువకుల తెలివితేటల వల్ల గోదావరి గట్టులు( Godavari embankments ) సందర్శకులతో కిక్కిరిసిపోతున్నాయి.

“ఇన్ని రోజులు వలలతో చాలా ఇబ్బందులు, తంటాలు పడ్డాం.కానీ, ఈ యువకుల టెక్నిక్ విన్నామే కాకుండా చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే” అంటూ కొందరు మత్స్యకారులు వీరి టెక్నిక్ ను ప్రశంసిస్తున్నారు.కొత్తదనం, సృజనాత్మకత, విజయవంతమైన ప్రయోగాలతో కోనసీమ యువత ఈ విధంగా తమ తెలివితేటలను చాటుకున్నారు.ఈ టెక్నిక్‌ సాధారణంగా చేపల వేటకు వినూత్న దిశలో అడుగులు వేస్తూ, మరికొంతమందికి స్ఫూర్తిని ఇస్తుందనడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube