ఏపీలో పెన్షన్ల కోసం వృద్ధులు ఎండలో నిలబడి ఎదురుచూడాల్సిన దుస్థితి వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) అన్నారు.పెన్షన్లకు డబ్బులు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు.వాలంటీర్ల విషయంలో ఈసీపై చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు.
జన్మభూమి కమిటీల అక్రమాలు ప్రజలకు గుర్తొచ్చాయని చెప్పారు.అయితే చంద్రబాబు కుట్రలను ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు( Chandrababu naidu )పై ప్రజలంతా కోపంగా ఉన్నారని చెప్పారు.చంద్రబాబుకు స్వార్థం తప్ప మరేమీ పట్టదని విమర్శించారు.తప్పుడు ఆరోపణలను ఈసీ పరిగణనలోకి తీసుకోకుండా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.అదేవిధంగా పాజిటివ్ అంశాలపై వైసీపీ ప్రచారం చేస్తోందన్న సజ్జల తాము పూర్తి స్పష్టతతో ప్రచారం జరుపుతున్నామని చెప్పారు.
టీడీపీ, జనసేన( TDP, Jana Sena )కు ఏ విషయంలోనూ స్పష్టత లేదని ఆరోపించారు.