రాహుల్ ఆదేశాలతో అందరూ ఒక్కటయ్యేనా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు సంచలన మలుపులతో ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.అయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇక వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున వ్యూహాలు పన్నుతున్న పరిస్థితి ఉంది.

 Is Everyone United With Rahul S Orders , Revanth Reddy , Rahul Gandhi , Jaggare-TeluguStop.com

అయితే కాంగ్రెస్ పార్టీలో మిగతా పార్టీల కంటే భిన్నమైన పరిస్థితులు ఉంటాయన్న విషయం తెలిసిందే.దీంతో ఇక ఇప్పటికే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో నేతలందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ గాంధీ నేతలకు దిశానిర్దేశం చేసారు.

అయితే రాహుల్ గాంధీతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ  రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై రాహుల్ కు ఫిర్యాదు చేయడం, రేవంత్ కూడా తనకు తెలియకుండా జరుగుతున్న విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకుంటానని రాహుల్ కు సంజాయిషీ ఇచ్చుకున్న విషయం తెలిసిందే.

అయితే సమావేశం చివరలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేయాలని టీఆర్ఎస్ తో ఎంఐఎంతో ఎలాంటి పొత్తులు ఉండవని కావున ఒంటరిగానే మనం బరిలోకి దిగబోతున్నామని కావున అధికారంలోకి ఎలా రావాలనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని కావున పార్టీలో విభేదాలను పక్కన బెట్టి  ఐక్యంగా  పనిచేయాలని రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారు.

అయితే కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ ఆదేశాలను అమలులో పెడతారా అందరూ కలిసి పనిచేస్తారా లేదా అనేది ఇప్పుడే మనం స్పష్టంగా చెప్పలేకపోయినా రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.అయితే రాహుల్ తో భేటీ గురించి జగ్గారెడ్డి లాంటి నేతలెవరూ స్పందించకపోవడం ఒక్కసారిగా రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది .ఏది ఏమైనా రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ఆదేశాలు ఏ మేరకు అమలయ్యాయనే విషయం మనకు తెలిసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube