‘వి’ చిత్రంలో కొత్త ఎంట్రీ.. ఎవరో తెలుసా?

నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వి’ ఇప్పటికే షూటింగ్ పనులు చివరి దశకు చేరుకుంది.ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని విలన్ పాత్రలో నటిస్తున్నాడని, హీరోగా సుధీర్ బాబు చేస్తున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది.

 Thaman On Board For V Movie-TeluguStop.com

ఇక ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం మంచి అంచనాలు క్రియేట్ చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

కాగా ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతాన్ని అందిస్తుండగా, మరో మ్యూజిక్ సెన్సేషన్‌ను ఈ సినిమా కోసం తీసుకున్నారు చిత్ర యూనిట్.

అల వైకుంఠపురములో చిత్రంతో ప్రపంచాన్ని ఊపేసిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో ఈ సినిమా కోసం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.థమన్ కూడా ఈ సినిమాకు ఎలాంటి బీజీఎం అందిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇప్పటికే బీజీఎం ఎక్స్‌పర్ట్ అని పేరుతెచ్చుకున్న థమన్, ఈ సినిమా కోసం మరోసారి తన విశ్వరూపాన్ని చూపించడం ఖాయమని అంటున్నారు.

Telugu Nani, Nivedha Thomas, Sudheer Babu, Thaman-Movie

నాని, సుధీర్ బాబులు కలిసి నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అదితి రావు హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్‌ను ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తుండగా, మార్చి 25న సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ఈ సినిమాకు థమన్ ఎంతమేర ఉపయోగపడతాడో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube