మణిరత్నం ప్రెస్టిజియస్ గా తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాలో విక్రం, కార్తీ, జయం రవి నటించగా ఫీమేల్ లీడ్స్ గా ఐశ్వర్య రాయ్, త్రిషలు చేశారు.
రెండు పార్టులకి కలిపి దాదాపు 500 కోట్ల దాకా బడ్జెట్ పెట్టినట్టు తెలుస్తుంది.మణిరత్నం ఈ సినిమాను ఒక డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కించారని తెలుస్తుంది.
అయితే సినిమా బడ్జెట్ లో 50 కోట్ల దాకా స్టార్స్ రెమ్యునరేషన్ కోసమే ఖర్చు అయినట్టు తెలుస్తుంది.సినిమాలో ఎవరెవరు ఎంత తీసుకున్నారు అన్నది బయటకు వచ్చింది.
సినిమాలో మెయిన్ లీడ్ విక్రం 12 కోట్లు తీసుకోగా.ఐశ్వర్య రాయ్ 10 కోట్లు తీసుకుందట.
జయం రవి 8 కోట్లు, కార్తీ 5 కోట్లు తీసుకోగా త్రిష రెండున్నర కోట్లు తీసుకుందట.ఐశ్వర్య లక్ష్మి కోటిన్నర ప్రభు 1.25 కోట్లు శోభిత ధూళిపాళ 1 కోటి, ప్రకాశ్ రాజ్ 1 కోటి తీసుకున్నారట.మొత్తానికి కాస్టింగ్ కోసమే భారీగా కేటాయించారు.
జూనియర్ ఆర్టిస్ట్ మిగతా క్యారక్టర్ ఆర్టిస్ట్ లు అందరితో కలిపి 60, 70 కోట్లు రెమ్యునరేషన్స్ కే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది.తమిళ బాహుబలిగా ప్రమోట్ చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అన్నది మరికొద్ది గంటల్లో తెలుస్తుంది.