నిద్ర లేవగానే కండరాల్లో నొప్పిగా అనిపిస్తుందా? అయితే అందుకు కారణాలు ఇవే..!

నిద్ర లేవగానే మీ శరీరం అలసటగా అనిపించడం, కండరాల్లో నొప్పిగా అనిపించడం, తలనొప్పి లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.అయితే అందుకు మీ స్లీపింగ్ పొజిషన్, వెయిట్, స్లీప్ డిసార్డర్ తో పాటు విటమిన్లు, పోషక లోపం కూడా కారణం కావచ్చు.

 Do You Feel Sore Muscles When You Wake Up But These Are The Reasons , Muscles,-TeluguStop.com

మీరు నిద్ర మేలుకోగానే శరీరంలో వివిధ అవయవాల్లో నొప్పులు, హార్ట్ బీట్( Pains, heart beat ) లో మార్పులు సంభవించడానికి ప్రత్యేక కారణాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.హైపోకాల్సెమియా రక్తంలో కాల్షియం లెవల్స్, విటమిన్ డి( Calcium levels, vitamin D ) లోపం వంటి కారణాలవల్ల నిద్ర లేవగానే బాడీపెయిన్స్ వచ్చే అవకాశం ఉంది.

ఎందుకంటే శరీరంలో కిడ్నీలు, కండరాలు ఇతర ముఖ్యమైన అవయవాలు సరిగ్గా పనిచేయడానికి ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కాల్షియం ఎంతో అవసరం.కాల్షియం ను గ్రహించడానికి ఉపయోగపడే విటమిన్ డీ శరీరంలో తగినంత లేకపోతే అవయవాలలో, ఎముకల్లో, కండరాల్లో నొప్పులు వస్తాయి.

Telugu Calcium Levels, Tips, Muscles, Red, Vitamin, Wake-Telugu Health

మీ శరీరంలో ఎర్ర రక్తకణాల( Red blood cells ) పనితీరు సరిగ్గా లేకపోతే రక్తహీనతకు దారితీస్తుంది.ఇలాంటి పరిస్థితులలో శరీర కణజాలం తగిన ఆక్సిజన్ ను గ్రహించదు.ఈ కారణంగా శరీర భాగాలు తీవ్రంగా అలసిపోయినట్లు అనిపించవచ్చు.దీంతోపాటు మానసిక అలసట, హార్ట్ బీట్ పెరగడం, మైకం కమ్మినట్లు అనిపించడం, తల లేదా ఛాతి నొప్పిగా అనిపించడం, అరికాళ్ళు అరిచేతులు చల్లగా అనిపించడం వంటి లక్షణాలు కూడా రక్తహీనతకు సూచనలుగా వైద్య నిపుణులు చెబుతున్నారు.

Telugu Calcium Levels, Tips, Muscles, Red, Vitamin, Wake-Telugu Health

అధిక బరువు శరీరం వెనుక భాగంపై, మెడపై ఒత్తిడిని పెంచుతుంది.శరీరంలోని వివిధ భాగాలలో కండరాల్లో నొప్పిని కలిగిస్తుంది.ఇంకా చెప్పాలంటే స్లీప్ బ్రీతింగ్ డిజార్డర్ సమస్యకు దారితీస్తుంది.స్లిప్ క్వాలిటీని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.దీంతోపాటు నాణ్యతలేని పరుపులు బాడిపై ఒత్తిడిని పెంచే స్లీపింగ్ పొజిషన్ కూడా ఉదయం నిద్ర మేలుకున్నప్పుడు బాడీపెయిన్స్ సమస్యకు కారణంగా చెప్పవచ్చు.కాబట్టి బరువు తగ్గడం మూలంగా మీ నిద్ర నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది.

దాని కారణంగా వచ్చే బాడీ ఫ్యాన్స్ కూడా తగ్గిపోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube