టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఛాలెంజ్ విసిరారు.విపత్తుల సమయంలో వైసీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలిచిందని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తూ బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కాకాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గతంలో టీడీపీ పాలన కాలంలో ఏనాడైనా రైతులను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే రైతులకు చేసిన మేలుపై, వారికి అందిన లబ్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.ఈ నేపథ్యంలో చంద్రబాబుకు ఏ మాత్రం నిజాయతీ ఉన్నా డేట్, టైం ఫిక్స్ చేసి తనతో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.







