అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన నలుగురు భారతీయ విద్యార్ధులు రోజుల వ్యవధిలో హత్యకు గురికావడం అగ్రరాజ్యంలోనూ, మనదేశంలోనూ కలకలం రేపింది.ఈ పరిణామాలు భారత్‌లో వున్న విద్యార్ధుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.
విదేశాలకు పిల్లల్ని పంపాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్ధితి నెలకొంది.అన్నింటికి మించి ఇండియానా రాష్ట్రంలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం( Purdue University ) ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.
రెండేళ్ల వ్యవధిలో ఈ వర్సిటీలో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధుల మరణాలు షాకిచ్చాయి.ఇటీవల నీల్ ఆచార్య( Neel Acharya ) మృతి క్యాంపస్‌లో విద్యార్ధుల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

గత నెలలో అదృశ్యమైన నీల్ ఆచార్య అనే విద్యార్ధి పర్డ్యూ క్యాంపస్‌లోనే శవమై కనిపించాడు.జనవరి 29న నిర్వహించిన శవపరీక్షలో అతని శరీరంపై గాయానికి సంబంధించి సంకేతాలు లేవని తేలిందని కరోనర్ క్యారీ క్యాస్టెలో తెలిపారు.ఆచార్య మరణానికి స్పష్టమైన కారణాలు తెలుసుకునేందుకు లోతుగా విచారణ నిర్వహిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనకు రెండేళ్ల ముందు ఇదే పర్డ్యూ యూనివర్సిటీలో చదువుకుంటున్న భారత సంతతికి చెందిన వరుణ్ మనీష్ ఛేడా (20)ను( Varun Manish Chheda ) తోటి రూమ్ మేట్, 22 ఏళ్ల కొరియన్ విద్యార్ధి జిమ్మీ షా దారుణంగా హత్య చేశాడు.

ఈ రెండు మరణాల తర్వాత పర్డ్యూ యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్ధులు క్యాంపస్‌లో తమ భద్రతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ మరణాలు భారతీయ విద్యార్ధుల్లో( Indian Students ) అవిశ్వాసం, ఆందోళనను నింపాయి.మా క్యాంపస్‌లో ఇలాంటి విషాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోందని పర్డ్యూలో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధి ఒకరు జాతీయ మీడియా సంస్థ ది హిందూస్తాన్ టైమ్స్‌తో అన్నాడు.ఈ ఘటనలు భద్రతా చర్యల గురించి ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా.యూఎస్‌లో నీల్ ఆచార్య, ఛేడాతో పాటు అకుల్ ధావన్, జాహ్నవి కందుల, వివేక్ సైనీలు ఇటీవలి ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు.