భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని( MS Dhoni ).ఈ రోజు 42 వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు.
ధోని 1981 జులై 7న జన్మించాడు.ధోని సారథ్యంలో భారత జట్టు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించింది.2007లో టీ20 వరల్డ్ కప్, 2011 లో వన్డే వరల్డ్ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించి పెట్టాడు.అంతేకాకుండా 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఐదవ సారి ఐపీఎల్ ట్రోఫీ అందించాడు.
ధోని గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఏమిటో చూద్దాం.మహేంద్రసింగ్ ధోని క్రికెట్లో లోకి అడుగు పెట్టక ముందు భారత రైల్వేలో ఓ ఉద్యోగి.ఖరగ్ పూర్ పరిధిలో ట్రైన్ టికెట్ ఎగ్జామినర్ గా విధులు నిర్వర్తించాడుమహేంద్రసింగ్ ధోని 2007లో తొలిసారి సాక్షిని కలిశాడు.2010లో ధోని- సాక్షి ( Sakshi )వివాహం జరిగింది.వీరికి జివా అనే కూతురు సంతానం.1999- 2000 లో ధోని దేశవాళి క్రికెట్లోకి అడుగు పెట్టాడు.2004లో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు.
2005 లో శ్రీలంక( Sri Lanka ) లో జరిగిన వన్డే మ్యాచ్లో 183 పరుగుల (నాట్ అవుట్) చేశాడు.ఇదే వన్డేల్లో ధోని కొట్టిన అత్యధిక స్కోరు.అంతర్జాతీయ టీ20 లలో అత్యధిక క్యాచ్లు అందుకున్న రెండో వికెట్ కీపర్ గా ధోని పేరుపై రికార్డ్ ఉంది.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రెండవ బ్యాటర్ధని రికార్డ్ నెలకొల్పాడు.క్రీడారంగంలో ధోని సేవలకు గాను భారత ప్రభుత్వం 2009లో పద్మశ్రీ, 2018లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.2011లో ధోని లెఫ్టినెంట్ కల్నల్ హోదా దక్కించుకున్నాడు.కపిల్ దేవ్ తర్వాత ఆ గౌరవం పొందిన రెండవ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని.
టెస్ట్ క్రికెట్లో డబల్ సెంచరీ కొట్టిన ఒకే ఒక భారత వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్రసింగ్ ధోని.మహేంద్రసింగ్ ధోని తన క్రికెట్ కెరియర్ లో 90 టెస్టులు ఆడి 4876 పరుగులు, 350 వన్డేలు ఆడి 10773 పరుగులు, 98 టీ20లు ఆడి 1617 పరుగులు సాధించాడు.