కోట్లు పలికిన 'మోడి'సూట్

గత ఎన్నికల పుణ్యమా అంటూ నరేంద్ర మోడి యూత్ ఐకాన్ గా మారిపోయాడు.అయితే అదంతా పక్కన పెడితే.

రిపబ్లిక్ డే సందర్భంగా ఒబామాతో సమావేశం అయిన సందర్భంగా ఆయన ధరించిన బంద్ గలా సూట్ ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో, ఎన్ని విమర్శలకు దారి తీసిందో అందరికి తెలిసిందే.ఇక ఆసూట్ పై నరేంద్ర మోడి అని చిన్న అక్షరాలతో ముద్రించడం ఆ సూట్ ప్రాముఖ్యతను భారీగా పెంచేసింది.

అందులో భాగంగానే ఆ వివాస్పద సూట్ ను వేలానికి పెట్టగా.భారీగా రూ.4.31 కోట్లు పలికింది.ఇక ఈ వేలంలో భాగంగా చివరి రోజు ధర్మనందన్‌ డైమండ్స్‌ చైర్మన్‌ లాల్‌జీభాయ్‌ పటేల్‌ గరిష్ట బిడ్‌ను దాఖలు చేయడంతో ఆయనకు ఈ సూట్ ను సొంతం చేసుకున్నారు.అంతే కాదు సూరత్‌కే చెంది న బిల్డర్‌ లవ్‌ జీ బాద్‌షా అందరికంటే ఎక్కువగా రూ.5 కోట్లకు బిడ్‌ వేసినప్పటికీ సమయాభావం మించిపోవడంతో చుక్కెదురైంది.సాయంత్రం 5 తరువాత బాద్‌షా బిడ్‌ వేయడంతో తిరస్కరణకు గురైంది.అంతకుముందు మరో వ్యాపారి రూ.4.17 కోట్ల వరకూ ధరను ప్రకటించినప్పటికీ సూట్‌ను దక్కించుకోలేకపోయారు.ఇక ఈ సూట్ మాత్రమే కాకుండా మొత్తం 455 వస్తువుల విక్రయానికి ప్రభుత్వం మూడో రోజులపాటు వేలంపాటను నిర్వహించింది.సుమారు రూ.10 లక్షల విలువైన సూట్‌ను సొంతం చేసుకునేందుకు వేలంలో పలువురు బడా బాబులు పోటీపడటం విశేషం.

చేపల వర్షం ఎప్పుడైనా చూసారా.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు